Loading...
Paul Dhinakaran

ఆపత్కాలమందు మిమ్మల్ని తప్పించే దేవుడు!

Dr. Paul Dhinakaran
09 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆపత్కాలమందు తప్పించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అయితే, దేవుని కటాక్షము మన మీద ఉండాలంటే, మనము చేయవలసిన కార్యమేదనగా, బీదలను కటాక్షించాలని ఆయన మన పట్ల వాంఛ కలిగియున్నాడు. ఎందుకంటే, ఇబ్బందులలో ఉన్నవారిని దేవుడు చూస్తున్నాడు. ఆలాగుననే, శ్రమలను సహించిన భక్తుడైన యోబును గురించి మనము బైబిల్‌లో చదివియున్నాము. తాను శోధింపబడినను దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని అతడు ఎన్నటికిని కోల్పోలేదు. తన స్నేహితుల నుండి పరిహాసపు మరియు అవహేళన మాటల ద్వారా బాధాకరమైన పరిస్థితిలో కూడా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. తనపై బాధ కలిగించే పరిహాసపు మాటలు కురిపించిన వారి పట్ల కూడ అతడు శ్రద్ధ చూపినప్పుడు, అతని పట్ల ఒక గొప్ప ఆశ్చర్య కార్యము దేవుడు జరిగించాడు. బైబిలు ఇలా చెబుతోంది, " మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను '' (యోబు 42:10). కాబట్టి, ఈనాటి వాగ్దానము ప్రకారము " బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును '' (కీర్తనలు 41:1) అన్న వచనము ప్రకారము ఒడిశాలోని టెన్సాకు చెందిన బినా గురియాకు అద్భుతం జరిగింది. దేవుడు మనము చేసే మంచి కార్యాలకు ఎలా ప్రతిఫలమిస్తాడో చూడటానికి ఈ క్రింద ఇవ్వబడిన ఆమె సాక్ష్యాన్ని చదవండి!

గత 7 సంవత్సరములుగా నేను జీర్ణ సమస్యతో బాధపడుచున్నాను. అజీర్ణం కారణముగా, నా కడుపు ఉబ్బిపోతుండేది. నేను చాలా వేదన అనుభవించాను. ఈ కూటమునకు వచ్చుటకు ముందుగా, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి, నన్ను పరిపూర్ణముగా, స్వస్థపరచవలెనని ప్రార్థించాను. ఆలాగుననే, సహోదరులు. పాల్ దినకరన్‌గారు ప్రార్థించుచున్నప్పుడు నేను కూడ వారితో ఏకీభవించాను. ఆ సమయములో ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి, " బీనా, దుర్మాత శక్తుల వలన, అజీర్ణముతో మీరు పీడింపబడుచున్నారు. మీ కడుపులో ఎటువంటి ఆహారము నిలుచుట లేదు. మీరు మీ స్వస్థత కొరకు ఏడ్చుచున్నారు. దేవుడు మీ పేరును నాకు చూపించుచున్నాడు. బీనా, ఆయన మీ యొద్దకు వచ్చుచున్నాడు. మీరు అనేకులను జ్ఞాపకము చేసుకొనినందున, ఎందరో పిల్లలకు సహాయము చేసినందున, దేవుడు మీ జీవితమును నేడు మార్చుచున్నాడు. యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయన ఈనాడే మీ వ్యాధి నుండి మిమ్మును విడిపించుచున్నాడు. ఆయన తన శక్తితో మిమ్మును నింపి సంపూర్ణముగా స్వస్థపరచుచున్నాడు '' అని చెప్పారు. ఆ సమయములో నేను దేవుని స్పర్శను అనుభూతి చెందాను. నా శరీరములో విద్యుత్ ప్రవహించుచున్నట్లుగా అనిపించి, నేను క్రింద పడిపోయాను. నేను లేచినప్పుడు, నా నొప్పి నుండి పరిపూర్ణ విడుదల పొందాను. నా పొట్ట చాలా తేలికగా అనిపించింది. కొన్ని సంవత్సరముల క్రితం బొకోరాలో జరిగిన కూటములో దేవుడు సహోదరులు డి.జి.యస్. దినకరన్ గారి ద్వారా నన్ను పేరు పెట్టి పిలిచి, పరిశుద్ధాత్మతో నింపాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయుచున్న మంచికార్యాలన్నిటిని దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆయన మిమ్మల్ని మరచిపోకుండా గుర్తుంచుకొనియున్నాడు. ఆయన మిమ్మల్ని మరియు మీ మంచి కార్యాలను మరచిపోవుటకు మానవుడు కాదు. ఈ రోజు మీ ప్రతిఫలమును పొందుకొనండి. యేసు ఇలా అంటున్నాడు, " అందుకు - రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును '' (మత్తయి 25:40). ఆయన పలికిన మాటలు ఎంత నిజం కదా! నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని చూసే ప్రభువు ఇలా అంటున్నాడు, " నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు '' (ప్రకటన 3:8) అన్న వచనము ప్రకారము మీరు ఇతరుల పట్ల మంచి కార్యములను జరిగించినట్లయితే, అప్పుడు మీ యెదుట మూయబడిన ద్వారములన్నియు ఈనాడు దేవుడు తెరుస్తాడు. యోబు వలె మీరు ఇతరుల పట్ల లేక మీ కుటుంబ సభ్యుల పట్ల పరిహాసపు మాటలు పలుకుచున్నారని బాధపడుచున్నారా? ఆలాగైతే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు వారి పట్ల యోబు వలె ప్రార్థించండి మరియు బీదలను కనికరించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనను అంగీకరించి, మీ ఆపదల సమయములలో, మీరు చేసిన మంచి కార్యములను తలంచి, మీ పట్ల మరియు మీ కుటుంబము పట్ల అద్భుతకార్యములను జరిగించి, మీకు తగిన ప్రతిఫలమును రెండంతలుగా అనుగ్రహించి, మిమ్మల్ని ఆనందింపజేస్తాడు.
Prayer:
కృపకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

మేము బీదలను కనికరించునట్లు అటువంటి దీన హృదయమును మాకు దయచేయుము. మాకు ఎన్నో అవసరాలు ఉన్నప్పటికిని, మా సమయాన్ని, డబ్బును, మంచి మాటలను ఇతరుల జీవితాల్లో విత్తడానికి మాకు కృపను అనుగ్రహించుము. పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వారమని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మా గురించి ఎంతో దయగలిగియున్నావు. కాబట్టి, నీ కరుణా కటాక్షములను మాపై కనుపరచుము. దేవా, అనుదినము మేము అనుభవించు శ్రమలను మరియు మా కన్నీటిని చూచుచున్న నీవు, మా కన్నీటిని నీ బుడ్డిలో సేకరించియున్న వాటిని జ్ఞాపకము చేసుకొని, దానికి తగిన ప్రతిఫలమును మాకు దయచేయుము. మా పట్ల పరిహాసపు మాటలు మాట్లాడిన వారి పట్ల యోబు వలె మేము ప్రార్థించునట్లుగా మాకు అటువంటి మంచి హృదయమును దయచేయుము. ఎంతో కాలము నుండి మేము అనుభవించుచున్న శ్రమలు మరియు వ్యాధులను, అప్పుల బాధల నుండి మమ్మల్ని విడిపించి, యోబును రెండంతలుగా దీవించినట్లుగా, మాకును రెండంతల ఆశీర్వాదమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000