Loading...

మీకు తగిన కాలమందు ఉత్తమ దీవెనలనిచ్చే దేవుడు!

Shilpa Dhinakaran
14 Apr
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో తగిన కాలమందు ఆశీర్వాదపు జల్లులను కురిపిస్తానని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దేవుడు ఉత్తమమైన దానిని తగిన కాలమందు అనుగ్రహించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్‌లో ఈ రోజు దేవుని నుండి పొందుకున్న వాగ్దానమేమనగా, లేవీయకాండము 26:4 వచనమును ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును '' అన్న వచనము ప్రకారము తగిన కాలమందు ఋతువుల ప్రకారము ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఆశీర్వాదం అవసరమైనప్పుడు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు మన భవిష్యత్తు పట్ల గొప్ప ప్రణాళికలు ఉంటాయి. నేను ఈ కాలేజీకి వెళ్ళాలి, ఈ కోర్సు తీసుకోవాలి, ఈ వయస్సులో పెళ్లి చేసుకోవాలి, అప్పుడు నా జీవితం ఆశీర్వదించబడుతుంది, ఇంకను నేను నా భవిష్యత్తులో ఉన్నత స్థానమునకు వెళ్లాలి అని మనం తలంచుకొంటాము. కానీ, యెహోవా, అటువంటి మిమ్మల్ని చూచి, " నేను నిన్ను తగిన సమయంలో ఆశీర్వదిస్తాను '' అని సెలవిచ్చుచున్నాడు.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఏది ఉత్తమమో ప్రభువునకు తెలుసు మరియు ఆయన మీ కోసం ఎప్పటికప్పుడు శ్రేష్టమైన కార్యాలను జరిగిస్తాడు. బైబిల్‌లో చూచినట్లయితే, " నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి '' (యెషయా గ్రంథము 55:8,9) అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎందుకంటే, దేవుని తలంపులు మన తలంపులవంటిని కావు; మన త్రోవలు ఆయన త్రోవలవంటిని కావు అని సెలవిచ్చుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె దేవుని మార్గములు మీ తలంపులకంటె ఆయన తలంపులు అంత యెత్తుగా ఉన్నవని బైబిల్ మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ప్రభువు మీ భవిష్యత్తు పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు మరియు మీరు చేయవలసినదేమనగా, మీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి అప్పగించడము మాత్రమే. మీరు, "ప్రభువా, నా జీవితాన్ని నీ వశము చేసుకో మరియు నా జీవితంలో నీ సంకల్పం జరగనివ్వు '' అని మీరు చెప్పాలి. మీరు అలా చేసినప్పుడు, మీ జీవితములోను మరియు భవిష్యత్తు పట్ల ఉన్న ప్రణాళికలను ప్రభువు విజయవంతము చేసి, మీరు మీ జీవితంలో ఆశీర్వదింపబడునట్లు చేస్తాడు.
నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు నేను చాలా మంచి విద్యార్థిని అని నాకు గుర్తు. నేను పదవ బోర్డు పరీక్షలలో 95% కంటే ఎక్కువ మార్కులను పొందుకున్నాను మరియు నేను మెడిసిన్ మాత్రమే చేయాలనుకున్నాను. ఆ సమయంలో మాకు నీట్ పరీక్ష లేదు మరియు ప్రభుత్వ కళాశాలలో సీటు పొందడానికి మా పన్నెండవ తరగతి ఫలితాల ద్వారా అర్హతను పొందవలసి వచ్చింది. నేను అర్హత సాధిస్తానని మరియు ఏదో ఒక ప్రభుత్వ కళాశాలలో చేరతానని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలలో నేను కావలసిన కట్ ఆఫ్ మార్కులను రెండు లేదా మూడు మార్కుల ద్వారా కోల్పోయాను. నేను ఎంతో మనో దుఃఖముతో హృదయం బ్రద్ధలైన స్థితిలో ఉండిపోయాను. నేను ప్రభుత్వ కళాశాలలో చేరలేను. కానీ, దేవుని దయవలన ఆయన చెన్నైలోని ఒక చక్కటి కళాశాలలో నాకు సీటును దయచేశాడు. ఆ కళాశాలలో నేను చదువును ఆనందించడమే కాదు, ఆ స్థలాన్ని కూడా నేను ఎంతగానో ఆనందించాను. అంతమాత్రమే కాదు, ప్రభువు నాకు అద్భుతమైన స్నేహితులను ఇచ్చాడు మరియు మేము అక్కడ మేము అందరము ఒక బృందముగా కలిసి ప్రార్థన సహవాసమును ప్రారంభించగలిగాము. ఇది ప్రభువు యొక్క ప్రణాళిక అని నేను గ్రహించినప్పుడు, నేను ఎంతో ఆనందించాను. నా ప్రియులారా, దేవుని మార్గాలు ఎల్లప్పుడూ మన మార్గాల కంటే ఉన్నతముగా ఉంటాయి. అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రణాళికలు విఫలమయ్యాయని మీరు హృదయ వేదనతో ఉంటే, ప్రభువు మీకు ఎల్లప్పుడూ ఉత్తమమైనదాన్ని ఇస్తాడని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితాలను మరియు ప్రణాళికలను దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన ఎల్లప్పుడు తగిన కాలములో మీకు ఫలముల నిచ్చి, మీ జీవితములో తగిన కాలమందు, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించి, మీ కరువు కాలములో మీకు సంతృప్తిని కలిగించి మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన మా పరలోకమందు తండ్రీ,

ప్రభువా, మేము నిన్ను మరియు నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాము. మాకు అవసరమైనప్పుడు సరైన సమయంలో ఆశీర్వాదపు వర్షాన్ని పంపించుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, మేము నీ ఆశీర్వాదముల కోసం ఎంతోకాలముగా వేచి ఉన్నాము. కాబట్టి, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు తగిన సమయములో మమ్మల్ని ఆశీర్వదించుము. మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చబోతున్నందులకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితములో తగిన కాలమందు, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మాకనుగ్రహించి, మా కరువు కాలములో మాకు సంతృప్తిని కలిగించి మమ్మల్ని వర్థిల్లజేసి నీ నామమునకు ఘనత కలుగునట్లు చేయుము. సంపూర్ణమైన మరియు సంతృప్తికరమైన ఆశీర్వాపు జల్లులను పొందడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము మా జీవితాన్ని నీ చేతుల్లోకి అంకితం చేస్తున్నాము. కనుకనే, నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని సరైన మార్గములో నడిపించుము. దేవా, నీవు మమ్మల్ని చూస్తున్నావని సంతోషించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000