Loading...
Evangeline Paul Dhinakaran

మీరు పరలోకానికి అర్హులవ్వండి!

Sis. Evangeline Paul Dhinakaran
31 Jul
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీకు ఎంతో అమూల్యమైన వాగ్దానంను అనుగ్రహించియున్నాడు. ఇది బైబిల్‌లోని 2 కొరింథీయులకు 1:22వ వచనము నుండి ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు '' అని చెప్పబడియున్నది. పరిశుద్ధాత్మ మన నిశ్చయత స్నేహితులారా. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎఫెసీయులకు 1:13వ వచనమును బైబిల్‌లో చదివినట్లయితే, " మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి '' అని చెప్పబడియున్నది.

ఒకసారి నా పిల్లలైన శ్యామ్ మరియు షారోన్, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించిన ఒక సినిమా చూస్తున్నారు. సినిమా చూచి ముగించిన తర్వాత, వారు నన్ను ఒక మంచి ప్రశ్న అడిగారు. అది ఏమిటో మీరు ఊహించగలరా? వారు ఇలా అడిగారు, " అమ్మా, మేము అభిషేకం పొందకపోతే, పరలోకానికి వెళ్లము, కదా? '' వారికి వచ్చిన ఈ తలంపు, నాకు ఆశ్చర్యంను కలిగించింది. ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని వివరించడానికి నేను ఆ సదావకాశాన్ని ఉపయోగించుకున్నాను. నేను వారితో, " అవును ప్రియబిడ్డలారా, మీరు చెప్పేది సరైనది. పరిశుద్ధాత్మను పొందడానికి మీరు దేవునికి మొరపెట్టాలి, అటుతరువాత, దేవుడు మిమ్మల్ని పరలోకానికి వెళ్ళడానికి అర్హులనుగా చేస్తాడు '' అని చెప్పాను. వెంటనే, వారు మోకరిల్లి, ' ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని నింపుమని ' దేవునికి మొరపెట్టుకున్నారు. ఆలాగుననే, దేవుడు వారిని తన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపాడు.
అవును ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ మనకు నిశ్చయత. దేవుడు మనకు పరిశుద్ధాత్మను ముద్రగా అనుగ్రహించియున్నాడు. మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామనే నమ్మకము పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి, ఈరోజు కూడా, ఈ సందేశము చదువుచున్న మీరు పరిశుద్ధాత్మను పొందాలని ప్రార్థించండి. అభిషేకము పొందుటకు దేవునికి మొరపెట్టండి. అప్పుడు సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు, మీలోనికి వచ్చి దేవుని బిడ్డగా మీపై తన ముద్రను వేసి, మీ హృదయములలో మీకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి, మిమ్మల్ని పరలోకమునకు అర్హులుగా మారుస్తాడు.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. నేటి వాగ్దాన వచనమునకై నీకు వందనాలు. ఇప్పుడు కూడా, ప్రభువా, నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి మమ్మల్ని అర్హులనుగా చేయమని మేము నీకు మొరపెట్టుచున్నాము. ప్రభువా, నీవు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడవు మరియు నీవిచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడవు కనుకనే, మేము నీ యొద్దకు వస్తున్నాము. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు నీ ముద్రవేసి, మా హృదయములలో ఆత్మ అను సంచకరువును అనుగ్రహించుము. నీ సత్యవాక్యము ద్వారా నేటి నుండి మేము పరలోకమునకు అర్హులగుటకు మాకు సహాయము చేయుము. యేసయ్య, నీ యొక్క పరిశుద్ధాత్మ మా హృదయంలోకి ప్రవేశించి, నీ ముద్రతో మమ్మల్ని ముద్రించుము. ప్రభువా, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ చేత కొలత లేకుండా నింపుము. ఇప్పుడే నీ అభిషేకమును మా జీవితాలలో పొందడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు వరములతో మమ్మల్ని నింపి, నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని అర్హులను చేయమని ప్రార్థించుచు, సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000