Loading...
Samuel Paul Dhinakaran

మీరు శ్రేష్ఠమైనవారుగా ఉండండి!

Samuel Dhinakaran
27 Jul
నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు అనుగ్రహించడానికి దేవుని యొద్ద గొప్ప ఆశీర్వాదం కలదు. ఈ సంవత్సరం ప్రారంభంలో యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు అనుగ్రహింపబడిన దీవెన కూడా ఇదే. అందును బట్టి మనమందరం దేవుని స్తుతించెదము. అదే ఆశీర్వాదం ఈ రోజు మీ జీవితంలోనికి రాబోవుచున్నది. ఇది యెషయా 60:3 లో నుండి ఎన్నుకొనబడినది: ఆ వచనమేమనగా, " జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. '' అవును నా స్నేహితులారా, దేవుడు తన వెలుగును మరియు ఉదయకాంతిని మీపై ప్రకాశింపజేయుచున్నాడు. ఈ వెలుగు వచ్చి మీ జీవితాన్ని మార్చబోవుచున్నది. మీ నుండి ప్రకాశింపబోయే ఈ వెలుగు ఏమైయున్నది? సమాధానం మత్తయి 5:16 లో తెలియజేయబడినది, " మనుష్యులు మీ స్రత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. '' ఈ వచనంలో, మీ స్రత్కియల ద్వారా వచ్చే మీ వెలుగును మీరు ప్రకాశింపజేయాలని బైబిల్ చెబుతోంది. నేను దానిని ' వెలుగు యొక్క శ్రేష్ఠత అని పిలిచెదను ' ఈనాడు ప్రజలు దానిని మీలో చూడబోవుచున్నారు.

తన జీవిత ప్రారంభ దినాలలో, మా తాతగారు ఒక బ్యాంకులో పనిచేయు చుండెను. ఆయన పగలంతయు బ్యాంకులో తన ఆఫీసు పనులు పూర్తి చేసికొనిన, తరువాత సాయంత్రం దేవుని పరిచర్య చేసేవారు. అయినప్పటికీ, ఆయన బ్యాంకులో తన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అలాగే, ఆయన ప్రభువు కోసం తన వంతు ఎంతగానో కృషి చేసేవారు. తన మంచి క్రియల ద్వారా దేవుని వెలుగు మా తాతగారి నుండి ప్రకాశించేది. ప్రతి ఒక్కరూ తనను పొగడుట మాత్రమే కాకుండా మరియు ఆయనను చాలా ప్రేమించేవారు. ఆయన సహోద్యోగులు వచ్చి ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన తన విశిష్ఠతకు కారణాన్ని వారికి తెలియజేసేవారు. అంతమాత్రమే కాదు, ఆయన యేసును గురించి వారితో మాట్లాడేవారు.
అదేవిధంగా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీలో చేసే గొప్ప క్రియలు ప్రజలు చూడబోవుచున్నారు నా స్నేహితులారా. అప్పుడు, తన వెలుగును మీ మీద ఉదయింపజేయుచున్న ప్రభువునొద్దకు మీరు మార్గము చూపవచ్చును. అందువలన, మీ జీవితంలో ఈ శ్రేష్ఠమైన వెలుగును ఇతరులకు కనుపరచడానికి సిద్ధంగా ఉండండి. ఇది యేసును గూర్చి తెలియని వ్యక్తులు మీ యొద్దకువచ్చినప్పుడు వారిని ఆకర్షించబోతోంది. ఈ వెలుగు మీ వద్దకు రాజులను తీసుకురాబోతోంది. మీలో ఏదో ప్రత్యేకత ఉందని అందరూ మిమ్మల్ని చూచి చెబుతారు. రాజులు మిమ్మల్ని వారి ప్రక్కన ఉంచుకుంటారు, తద్వారా వారు మీలో ఉన్న వెలుగు నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ప్రభువు నుండి ఈ వెలుగును పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. కావుననే, నేడు మిమ్మును మీరు ఆయన హస్తాలకు అప్పగించుకొన్నట్లయితే, మీ చుట్టు ఉన్నవారందరు మీ వెలుగును చూచి మీ యొద్దకు వస్తారు, అంతమాత్రమే కాదు, మీ ఉదయకాంతిని చూచుటకు రాజులు కూడ మీ యొద్దకు వచ్చునట్లు చేసి ప్రభువు మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చిన మా పరమ తండ్రీ,

నేటి వాగ్దాన వచనమునకై నీకు వందనములు. దేవా, ఈ వాగ్దానం మాలో నెరవేర్చడానికై నీవు మమ్మల్ని యోగ్యులనుగా మార్చుము. ప్రభువా, నీ వెలుగును మాపై ప్రకాశింపజేయుము. మా ద్వారా ఇతరులకు ఆ వెలుగు ప్రకాశించునట్లు చేయుము. దేవా, మా సత్‌క్రియల ద్వారా మా నుండి నీ వెలుగు ప్రకాశించునట్లు చేయుము. ప్రభువా, నీ కొరకు గొప్ప మరియు బలమైన కార్యాలు చేయడానికి మాకు సహాయం చేయుము. ప్రజలను ఆశ్చర్యపరిచే క్రియలు చేయడానికి ఈ వెలుగు ద్వారా మాకు బుద్ధిని మరియు జ్ఞానాన్ని అనుగ్రహించుము. ఇది నిన్ను గుర్తెరగని వ్యక్తులను నీ వైపునకు ఆకర్షించునట్లు చేయుము. ఈ వెలుగు దృష్టికి రాజులను ఆకర్షించునట్లు చేయుము. ప్రభువా, నీ రాజ్యాన్ని నిర్మించడానికి మమ్మల్ని ఒక సాధనంగా వాడుకొనుము తద్వారా, మేము నీ నామమునకు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. చీకటిలో ఉన్న మా జీవితాలలో వెలుగును చూచుటకు సహాయము చేయుము. మేము పయనించుచున్న అవమానపు మార్గముల నుండి మమ్మును తొలగించి, నూతనపరచుము. మేము అనుభవించు శ్రమలన్నిటిని తొలగించి, మా చీకటి జీవితాలను వెలుగులోనికి మార్చి, రాజులందరు మా ఉదయకాంతికి వచ్చునట్లుగా అటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి, మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000