Loading...
Evangeline Paul Dhinakaran

నిశ్చయముగా పొందుకొనెదరు

Sis. Evangeline Paul Dhinakaran
07 Sep
తూరు సీదోను ప్రాంతముల నుండి ఒక కనాను స్త్రీ, యేసు వద్దకు వచ్చి, ‘‘ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను’’ (మత్తయి 15:21-28). దేవుడు తన వద్దకు వచ్చిన ప్రతిఒక్కరికి జవాబు ఇచ్చుననే నమ్మకముతో ఆమె ఆయనను విడిచిపెట్టకుండా అడుగుతూనే ఉన్నందున, ఆమె ఆశించిన స్వస్థతను పొందుకొనినది.

తిరుచ్చి అను నగరమునకు చెందిన సహోదరి రెబెక్క ప్రభాకర్‌ గారు పొందుకొనిన ఇటువంటి సాక్ష్యమునే మనము ఇప్పుడు చూసెదము: ‘‘నేను ఒక ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయురాలను మరియు నా భర్త ఒక కంపెనీలో పని చేస్తున్నారు. మాకు 2000 సంవత్సరములో వివాహమైనది. అనేక సంవత్సరములు మాకు సంతానము కులుగ లేదు. కనుక మేము కొందరు డాక్టర్లను కలిసి, చాలా రోజులు చికిత్స పొందుకొన్నాము. 2010వ సంవత్సరము వరకు మేము చికిత్స తీసుకొనినను, ఎటువంటి ప్రయోజనము లేనందున చాలా అలసిపోయి, చికిత్స నిలిపివేశాము. తిరుచ్చిలోనున్న ‘యేసు పిలుచుచున్నాడు’ ప్రార్థన గోపురమునకు వెళ్లి, మాకు సంతానము కులుగుట కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకొన్నాము. వారు మా కొరకు ఎంతో భారముతో ప్రార్థన చేశారు. మేము ప్రార్థన గోపురమునకు క్రమంగా వెళ్లి ప్రార్థన చేయించుకొనుట కొనసాగించాము. మా భర్త చెల్లెలు రీనా కూడ వివాహమైన నాలుగు సంవత్సరముల వరకు గర్భం ధరించలేదు. నేను నా కొరకు మాత్రమే గాక, మా ఆడపడుచు కొరకు కూడ ప్రార్థన చేశాను. నాకు వివాహమైన 14 సంవత్సరముల తరువాత గర్భము ధరించుటకు ప్రభువు నాకు కృపననుగ్రహించాడు. 2015వ సంవత్సరములో నాకు ఒక ఆడ బిడ్డ పుట్టింది. మూడు నెలల తరువాత, దేవుడు మా ఆడపడుచుకు కూడ సంతానమును అనుగ్రహించి ఆశీర్వదించాడు. దేవుడు మాకు ఇద్దరు అమూల్యమైన బిడ్డలను అనుగ్రహించి, మా కుటుంబమును సంతోషముతో నింపాడు. దేవునికే మహిమ కులుగును గాక.’’
మన పరిస్థితి అసాధ్యమైనదిగా ఉన్నప్పుడు, మనము ప్రార్థన యందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా జవాబు పొందుకొనెదము. ‘‘అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కులుగునని మీతో చెప్పుచున్నాను’’ (మార్కు 11:24) అని యేసు సెలవిచ్చుచున్నాడు. ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చుట యందు దేవుడు యథార్థవంతుడై యున్నాడు. కొన్ని సమయములలో ఆయన ‘సరే’ అని చెప్పును, కొన్ని సమయములలో ‘లేదు’ అని చెప్పవచ్చును మరియు మరి కొన్ని సమయములలో ‘వేచియుండండి’ అని కూడ ఆయన చెప్పవచ్చును. ఏదైనను, దేవుని యొద్ద నుండి జవాబును పొందుకొనుట అనునది చాలా అమూల్యమైన విషయము. మనము చేయవలసినదంతయు నమ్మకముతో అడగవలెను. మనము దేవుని సందేహించకుండా ఆయన వద్దకు వెళ్లవలెను లేక కనాను స్త్రీ వలె విడిచిపెట్టకుండా అడగవలెను. దేవుడు మనకు జవాబిచ్చుట మాత్రమే గాక, మన విశ్వాసమును బట్టి ఆయన మనలను అభినందించును.
Prayer:
ప్రేమగల తండ్రీ,

నా పరిస్థితిని గూర్చి, నీ చిత్తమును నాకు చూపించి, నీ వాక్యము ద్వారా నాతో మాటలాడుము. నీవు నాకు అద్భుతము చేయుదువని నేను విశ్వసించుచున్నాను. నీవు నీ వద్దకు వచ్చిన ప్రజల ప్రార్థనలను ఆలకించి, వారిని స్వస్థపరచిన ప్రకారం, నా జీవితములో కూడ అద్భుతమును చేయుము. నేను నీ ఆశీర్వాదమును పొందుకొనేవరకు నిన్ను విడిచిపెట్టక ప్రార్థన చేసెదను. నా ప్రార్థన ఆలకించినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000