Loading...
Stella dhinakaran

భయపడకుడి

Sis. Stella Dhinakaran
02 Sep
ప్రతి ఒక్కరు తమ జీవితములో ఏదో ఒక సమయములో "బలహీనపడుదురు" లేక ‘‘సొమ్మసిల్లిపోవుదురు". అనేకులు, తమ నిరాశ శిఖరానికి చేరుకొనినప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలని కూడ ఆలోచించెదరు. కానీ అటువంటి వారికి బలమిచ్చుటకును మరియు ఆ సమయములో కూడ వారిని విడిపించుటకును శక్తిమంతుడైన యేసు క్రీస్తును ఆశ్రయించి, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయన నిశ్చయముగా వారికి శక్తిని అనుగ్రహించి, వారికి బలాభివృద్ధి కలుగజేయును. ‘‘భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు’’ (ద్వితీయోపదేశకాండము 31:6) అని ఆయన సెలవిచ్చుచున్నాడు. కనుక మనకు మార్గము కనిపించని సమయములో మార్గము ఏర్పడుటకు దేవుని యందు విశ్వాసముంచవలెను మరియు మన నిరాశలో నుండి మనము బయటకు వచ్చుటకు ఆయన యందు ఎంతో నమ్మకము కలిగియుండవలెను. మీరు మీ ఉద్యోగ స్థలములో నెరవేర్చవలసిన విధులను గూర్చి మీరు దిగులుపడుచున్నారా? లేక మిమ్మల్ని అణచివేయుటకు మీకు వ్యతిరేకముగా ఉన్న ప్రజలకు భయపడుచున్నారా? మీ కొరకు వారితో యుద్ధము చేసెదనని ప్రభువు మీతో చెప్పుచున్నాడు. ఆయన మీ కొరకు సమస్త కార్యములను సఫలము చేయును.

ఒక కుటుంబ యజమాని, ఎంతో శ్రమించినను, ఆయనకు ఎటువంటి పదోన్నతి లభించలేదు. కనుక ఆయన యొక్క కొద్ది ఆదాయంతోనే తన కుటుంబ ఖర్చులను చూసుకొనవలసి వచ్చినది. ఒక దినమున అతను ఎంతో నిరాశతో తన ఇంటిలో ఒంటరిగా కూర్చునియున్నాడు. ఆ సమయములో, ఒక వ్యక్తి చిన్న రేడియో ఒకటి చేతిలో పట్టుకొని, వారి ఇంటి వైపుగా నడుస్తూ వెళ్లుచున్నాడు. ఆ రేడియోలో నుండి, ‘‘కన్నీరంతా తుడుచును, కనుపాపవలె కాచును’’ అనే పాట తమిళంలో ప్రసారము చేయబడుచు ఉన్నది. కనుక, ఆ కుటుంబ యజమాని అతనిని పిలిచి, తన ప్రక్కన కూర్చోబెట్టుకొని, ఆ పాటంతయు మరియు ఆ తరువాత సహో. దినకరన్ గారి సందేశమును విన్నాడు. ఆ సందేశములోని మాటలు, విరిగిన హృదయముతోనున్న ఆయనకు ఎంతో ఆదరణను మరియు ఓదార్పును అనుగ్రహించెను. మరియు రేడియో కలిగియున్న వ్యక్తి కూడ తన జీవితములో ఏవిధంగా దేవుని ప్రేమను అనుభవించెననే విషయమును ఆయనకు వివరించాడు. వెంటనే ఆ కుటుంబ యజమాని తన జీవితమును దేవునికి సమర్పించుకొన్నాడు. ఆయన దేవుని శక్తిని మరియు బలమును పొందుకొన్నాడు మరియు అతని నిరాశ తొలగిపోయినది. దేవుడు ఆయనను ఆశీర్వదించెను.
పరిశుద్ధ గ్రంథమునందు కూడ మనము గిద్యోను జీవితమును చూసెదము. అతను ఎంతో భయభక్తులు కలిగినవాడు. అయినను దేవుడు అతనిని పరాక్రమవంతుడు అని పిలుచుచున్నాడు. ‘‘బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే’’ అని యెహోవా అతనితో చెప్పెను (న్యాయాధిపతులు 6:14). అవును, అసాధ్యమైనదానిని చేయుటకు దేవుడు మన ప్రక్కన ఉంటే చాలు. మీకున్న బలము చాలని నేడు దేవుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ‘‘భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును’’ (యెషయా 41:10) అని ఆయన మీకు సెలవిచ్చుచున్నాడు. దేవుని బలముతో మీరు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు (యెషయా 40:31).
Prayer:
ప్రేమగల తండ్రీ,

నీవే నాకు బలము. నీవు నన్ను ఎన్నడు ఎడబాయని దేవుడవు. ఎటువంటి బాధకు చింతకు చోటివ్వకుండా, నిన్ను స్థిరముగా పట్టుకొనుటకు కావలసిన దైవీక కృపను నాకు అనుగ్రహించుము. సంక్షోభ సమయములో నాతో నివసించుము మరియు నీ శక్తితో నన్ను నింపుమని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000