Loading...
Evangeline Paul Dhinakaran

మీరు సంతోషించి, ఘనతను అనుభవించండి!

Sis. Evangeline Paul Dhinakaran
26 Jan
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల చేసిన వాగ్దానములను దేవుడు నెరవేర్చాలని కోరుచున్నాడు. నేడు గొప్ప దినముగా పరిగణింపబడుచున్నది. అదేమనగా,ఈ రోజు మన దేశం గణతంత్ర దినమును జరుపుకొనుచున్నందున మనము సంతోషించి మరియు గంతులు వేయండి. కాబట్టి, నేడు దేవుడు యోవేలు 2:21 వ వచనమును మనకు అనుగ్రహించియున్నాడు. ఆ వచనమేమనగా, " దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను '' అని చెప్పినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, మీరు దేనినిమిత్తము భయపడనవసరం లేదని ప్రభువు మీకు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సంతోషించి గంతులు వేయండి, ప్రభువు మీ జీవితంలో గొప్పకార్యములు జరిగిస్తాడు. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు, " నేను మీ మధ్య గొప్ప కార్యములు చేయనివ్వండి. '' ఇంకను దేవుడు చెప్పిన మరో విషయం ఏమిటంటే, మనము భయపడకుండా ఉండటమే కాకుండా ప్రభువులో సంతోషించి మరియు గంతులు వేయడం మాత్రమే.

నేడు, నా ప్రియులారా, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ వాక్యంతో మన దేశాన్ని ఆశీర్వదిస్తానని ప్రభువు మన పట్ల వాగ్దానం చేయుచున్నాడు. ప్రభువు ఈ దేశంలో గొప్ప కార్యాలు చేయడానికి మనం అనుమతించాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ భయాన్ని మీలోనికి రానివ్వకండి. భయపడే మిమ్మును చూచి, భయపడవద్దు, సంతోషించి మరియు గంతులు వేయండి. అవును, ఇవి, దేవుని మాటలు. ఒక దంపతుల జీవితంలో ప్రభువు ఈలాంటి కార్యమునే జరిగించాడు. ఆ భార్యభర్తలకు 74 మరియు 72 సంవత్సరములు ఉంటాయి. సెల్వనాయగం అనే ఈ సహోదరుడు తన సాక్ష్యంను ఇలా పంచుకున్నాడు. నేను గుండెపోటు వ్యక్తిని మరియు నాకు డయాబెటిస్ కూడ ఉన్నది. నా భార్య మరియు నాకు ఇద్దరికి కోవిడ్ 19 సోకింది. నా భార్యను హాస్పిటల్‌లో చేర్చడానికి నాకు గది దొరకలేదు. నేను ఎన్నో చోట్ల తిరిగాను. కానీ, నాకు ఎక్కడ స్థలము దొరకలేదు. అయితే, ఆ రాత్రి ఎంతో ఆలస్యంగా హాస్పిటల్‌లో ఒక గది మాత్రమే కనుగొనగలిగాను. మేము ఇద్దరము బ్రదుకుతాము అన్న నిరీక్షణ ఎంతమాత్రము లేదనియు మరియు మాకు ఎటువంటి చికిత్స పొందలేక ఆలస్యమైనదనియు డాక్టర్లు చెప్పారు. అయినా, నేను నా నిరీక్షణను కోల్పోలేదు. నేను యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో పనిచేస్తున్నాను మరియు లక్షలాది మంది కోసం ప్రార్థిస్తున్నాను. కాబట్టి, ఎటువంటి కీడు మనల్ని తాకదని మరియు ప్రభువు మనలను నిశ్చయముగా, స్వస్థపరుస్తాడనియు నాకు నమ్మకము ఉన్నదని చెప్పాను. ఇదే అతనిలో ఉన్న గొప్ప నిరీక్షణయై యున్నది. ఆలాగుననే, ప్రభువు ఆ సహోదరుని విశ్వాసాన్ని ప్రభువు ఘనపరచాడు మరియు కోవిడ్ 19 తీసుకొని వచ్చిన నిస్సహాయతకు వ్యతిరేకంగా వారిద్దరినీ అద్భుతంగా స్వస్థపరిచాడు.
చివరికి,ఈ సహోదరుడు ఏం చెప్పాడో తెలుసా? యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేశాడు. నేను ప్రభువు యొక్క ఆనందముతో నింపబడియున్నాను అని చెప్పి, అతడు ఆనందముతో గంతులు వేశాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ అదే మాట చెబుతారు. " యెహోవా మన కొరకు గొప్పకార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతివిు '' కీర్తనలు 126:3లో చెప్పబడినట్లుగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటూ, ఆయన యందు నమ్మిక యుంచినప్పుడు, నిశ్చయముగా, ఈ ఘనతంత్ర దినోత్సవమును జరుపుకుంటున్న మీ మధ్య మరియు మన దేశంలోను ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు దేని నిమిత్తము భయపడక సంతోషించి గంతులు వేయునట్లుగా మిమ్మల్ని మార్చి, యెహోవా మీ పట్ల గొప్పకార్యములు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
ప్రేమా కనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ,

నీ ఆశీర్వాదకరమైన హస్తం మా మీదికి వచ్చి మా పట్ల అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించుము. దేవా, నీవు పై చెప్పబడిన దంపతులను ఆశీర్వదించినట్లుగానే, మా కుటుంబాన్ని కూడ ఆశీర్వదించుము. ప్రభువా, మా జీవితంలో ఉన్న భయాన్ని తొలగించుము. భారత దేశమును ఆశీర్వదించుము మరియు మన దేశములో గొప్ప కార్యములను జరిగించుము. దేవా, మేము నిన్ను గట్టిగా పట్టుకోవడం గురించి మాకు నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. నీ వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థించే దయను మాకు దయచేయుము. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకొని జీవించునట్లుగాను మాకు నీ కృపను దయచేయుము. దేవా, లోకం పట్ల సగం దేవుని పట్ల సగం ఆసక్తిని కనుపరచే మా హృదయ పరిస్థితిని దయచేసి మార్చుము. ప్రియ రక్షకా, ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికిని మేము కృంగిపోకుండా, నీ వాగ్దానముల మీద నమ్మకము కలిగి జీవించే నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు మా హృదయములోనికి రమ్ము, నీవు మాకు ఆశ్రయముగా ఎల్లప్పుడు మాతో వుంటూ మా జీవితములో ఏ మేలు కొదువలేకుండ మమ్మును ఆశీర్వదించుము. దేవా, నేడు మా జీవితాన్ని నీ చేతుల్లోకి సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ యొక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుటకు సహాయము చేయుము. నేడు నీ కృపను, దయను, మా మీద చూపించి, మా జీవితాలను ఉన్నత స్థానమునకు హెచ్చించుమని సమస్త మహిమ ఘనత స్తుతి నీకే చెల్లించుచు ప్రభువైన క్రీస్తుయేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000