Loading...

మీరు ఆశీర్వాదము కొరకు వేచియున్నారా?

Stella Ramola
24 Jun
ప్రియ స్నేహితులారా, ఈ దినము దేవుడు మీ కొరకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా 60:22 నుండి తీసుకొనబడినది. "వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును." అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును బలమైన దేశముగా మరియు గొప్ప జనముగా చేయబోవుచున్నాడు. దీని అర్థము ఏమిటి? "నేను ఏ పని చేసినను దానికి తగు ప్రతిఫలము పొందుకొనుటలేదు. నేను ఎంతో కష్టించి పనిచేయుచున్నాను. నా శ్రమ మరియు నేను వెచ్చించిన సమయమునకు ప్రతిఫలము ఏమియు నేను పొందటంలేదు. నా ఆశీర్వాదముల కొరకు ఎదురుచూచి నేను అలసిపోయాను. కష్టపడి చదివితే ఆశించే మార్కులను నేను పొందుకొనగలనా? నేను ఎంతగానో వైద్య చికిత్స చేయించుకున్నాను. నేను మరల నా ఆరోగ్యము పొందుకొంటానా? నాకు బాగవుతుందా?" అని ఈ రోజున మీరు చెప్పుచున్నారేమో! లేదా "నేను చాల శ్రమ పడుచున్నాను మరియు ఎంతగానో ప్రయత్నించుచున్నాను గాని నా ఉద్యోగములో నాకు గుర్తింపు రావడంలేదు. మేము సంతానము కోసము ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించాము కానీ మాకు సంతానము కలుగలేదు" అని చెప్పుచున్నారా? మీ ఆశీర్వాదముల కొరకు వేచియుండి భారంతో అలసిపోయారా? కావున నా ప్రియ స్నేహితులారా, మిమ్మును ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానని ప్రభువు వాగ్దానమిచ్చుచున్నాడు.
మీకు సహాయము చేసేందుకు ఈ లోకములో ఎవరు లేరని భావించుచున్నారేమో! ఇప్పుడు మిమ్మును ఎవరు గుర్తించుటలేదా? కానీ ప్రభువు మిమ్మును ఆశీర్వదించినపుడు మీరు ఎవరు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఆయన చేస్తాడు. మీరు మీ తలను సగర్వంగా పైకెత్తి నిలిచేలా ఆయన చేస్తాడు. "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు" అని ఆదికాండము 12:2 లో పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయన మిమ్మును ఆశీర్వదించుట మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మీరు ఆశీర్వాదకరముగా ఉండేలా చేస్తాడు. మీకు అవసరమైనదానికన్నా అధికముగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు తద్వారా మీరు ఇతరులను కూడా ఆశీర్వదించెదరు. అవును, ప్రభువు ఈ దినమున మిమ్మును ఆశీర్వాదముగా చేయుచున్నాడు. ఈ ఆశీర్వాదము పొందుకొనుటకు దీనిని స్వతంత్రించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి.
Prayer:
తండ్రీ దేవా,
 
నేను నా యొక్క ఆశీర్వాదముల కొరకు చాలా కాలంగా నిరీక్షించుచున్నాను కనుక నన్ను ఆశీర్వదించుము. నీవు తప్ప నాకు సహాయము చేసేవారు ఎవరూలేరు. ప్రభువా నన్ను గొప్ప జనముగా చేయుము. నా జీవితమును పరిపూర్ణము చేసి నన్ను పొంగిపొరలే సంతోషముతో నింపుము. ఈ దినముననే ఆ విధముగా చేయుచున్నందుకు నీకు వందనములు.
 
యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000