Loading...
Paul Dhinakaran

మీ ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు!

Dr. Paul Dhinakaran
01 Aug
నా అమూల్యమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో దేవుని వాగ్దానాన్ని మీ యొద్దకు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. గడిచిన నెలలలో మన పట్ల జాగ్రత్త వహించునట్లుగా ప్రభువు మనకు కృపను చూపించాడు. లేఖనము ఇలా చెబుతోంది, " యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు '' (విలాపవాక్యములు 3:22,23). ఈ మాటలు ఎంతవరకు నిజం! ఆయన కృప మరియు రక్షణ కొరకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉందాం. ఆగష్టు నెలలో వాగ్దాన వచనముగా 1 సమూయేలు 1:17 బైబిల్ నుండి ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక. ''

బైబిల్‌లో, హన్నా అను స్త్రీతో ప్రధాన యాజకుడైన ఏలీ, ఈ వాక్యమును పలికెను. ఆమెకు సంతానము కలుగలేదు. ఆమె భర్త, తనను ఎంతో ప్రేమించేవాడు. అయినను ఆమె గర్భం ధరించలేదు. కనుక, ఆమె భర్త యొక్క మరొక భార్య, ఆమెను అవమానించి మరియు హేళన చేసి మాట్లాడినది. అందువలన, హన్నా మనస్సు విరిగిపోయినది. దేవుని కట్టడలను నెరవేర్చుటకు హన్నా యొక్క భర్త, ఆమెను మరియు అతని మరొక భార్యను దేవుని మందిరమునకు తీసుకొని వెళ్లినప్పుడు, హన్నా ఒంటరిగా ప్రత్యక్ష గుడారమునకు వెళ్లి తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించింది. తన బాధను మరియు దీనస్థితిని భరించలేకపోయింది. అయినను, ఆమె తన నోరు తెరిచి, బిగ్గరగా ఏడవ లేదు. ఆమె తన హృదయములో ప్రార్థించుకొనుచుండెను. తద్వారా, ఆమె పెదవులు మాత్రము కదులుచు, ఆమె స్వరము వినబడలేదు. అందుకే బైబిల్ ఇలాగున చెబుతుంది, " మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును '' (1 సమూయేలు 16:7) అని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగానే, ఏలీ ఆమె యొక్క పై రూపమును మాత్రమే చూచెను.
అయితే, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండుట ఏలీ గమనించెను, ఆమె మత్తురాలైయున్నదని అనుకొన్నాడు. అందుచేత, ఏలీ కోపముతో ఆమెను అదుపు చేసెను. " హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పెను. అంతట ప్రధాన యాజకుడైన, " ఏలీ నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక '' (1 సమూయేలు 1:17) అని ఆమెతో చెప్పెను. ఈ వచనంలో దేవుని యొక్క మూడు గుణలక్షణాలు బయల్పరచబడినవని మనం చూడగలము. అవును! ఆయన మీ ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడు. రెండవది, మీరు అడిగినదానిని ఆయన దయచేయు దేవుడు మరియు మూడవదిగా, సమస్త ఆశీర్వాదములను సమాధానముతో అనుభవించునట్లు చేయు దేవుడు. ఈ నెలంతయు ప్రభువు మీకు ఇదేవిధంగా చేయబోవుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ చుట్టు ఉన్న గందరగోళ పరిస్థితులను చూచి దుఃఖించకుండా, హన్నా వలె మౌనముగా దేవుని సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ మనవులను ఆలకించి, మీకు తగిన సమాధానమును అనుగ్రహించి, ఈ నెలంతయు మిమ్మల్ని ఉన్నతమైన పై చెప్పబడిన ఈ మూడు ఆశీర్వాదములతో ఆనందింపజేయబోవుచున్నాడు. ఆశీర్వాదములను సమాధానముతో అనుభవించునట్లు చేయు దేవుడు, మీరు పరిపూర్ణ సంతోషమును పొందవలెనని ప్రభువు ఆశించుచున్నాడు. కాబట్టి, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొనియున్నాడు. గనుక, మీరు అడిగినప్పుడు, ఆయన దానిని దయచేసి, మిమ్మల్ని ఆనందింపజేస్తాడు.
Prayer:
ప్రార్థనలు ఆలకించు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ నెల ఆశీర్వాదము కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా కుటుంబాన్ని మరియు మమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, నీ అద్భుతాలను ఇతరులకు ప్రకటించడానికి మా జీవితాలను ఉపయోగించడానికి మాకు సహాయపడుము. ఈ నెలలో కూడా, మమ్మల్ని మేము నీ చిత్తానికి సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ సన్నిధిలో మా మ్రొక్కుబడులను నెరవేర్చడానికి మాకు నీ కృపను దయచేయుము. దేవా, హన్నా వలె మేము మా ప్రార్థన విన్నపాలన్నిటిని నీ సన్నిధిలో కుమ్మరించుచున్నాము. మా ప్రార్థనలకు జవాబు దయచేయుము. ఎంతో కాలముగా సంతానము లేని మాకు హన్నాకు అనుగ్రహించిన ప్రకారము మాకు కూడ సంతానము దయచేసి, నీ నామ ఘనత కొరకు ఆ బిడ్డలు వాడబడుటకు కృపను అనుగ్రహించుము. ఈ నెలలో ప్రభువా, మాకివ్వబోయే ఆశీర్వాదాల నిమిత్తము మేము నిన్ను మహిమపరచునట్లు చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000