Loading...
Stella dhinakaran

మీ ప్రార్థనలకు విశాలస్థలమందు ఉత్తరమిచ్చే దేవుడు!

Sis. Stella Dhinakaran
09 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నను సరే, మీరు ఆయనకు మొర్రపెట్టినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు ఉత్తరమిస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను '' (కీర్తనలు 118:5) అన్న వచనము ప్రకారము ఆలాగుననే, బైబిల్‌లో ఒక విధవరాలి పట్ల దేవుడు అద్భుతము జరిగించాడు. సారెపతు అను ఒక ఊరిలో ఒక విధవరాలు ఉండెను. ఆమెకు ఒక కుమారుడుండెను. ఆ దేశములో ఎంతో కరువు సంభవించగా, ఆమె మరియు ఆమె కుమారుడు ఎంతో పేదరికములో జీవించుచుండిరి. ఆ రోజు విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొని రమ్మని వేడుకొనెను. ఆమెకును మరియు ఆమె కుమారుని అప్పము సిద్ధము చేసికొనుటకై కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చెను. అటువంటి పరిస్థితిలో దేవునిచేత ప్రవక్తయైన ఏలీయా ఆమె యొద్దకు పంపబడెను. ఆమె ఎంతో పేద విధవరాలు, ఆమె పోషింపబడుటకు వేరే మార్గము లేదు. ప్రభువు ఆమె యొద్దకు ఒక అతిధిని పంపించెను. ఇలాంటి పరిస్థితులను స్త్రీలు తరచూ ఎదుర్కోవడం మనకు సహజం కాదా? మన సమర్పణకు ప్రతిఫలమివ్వడానికి దేవుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనలను పరీక్షిస్తాడు. ఆలాగుననే, ఆ విధవరాలు, తన పరిస్థితిని ప్రవక్తయైన ఏలీయాకు వివరించినది. అయినను అతడు విడువకుండా, ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును మరియు నా కుమారునికి ఆహారము సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చెనని చెప్పెను. దేవుడు మనల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడు కొన్నిసార్లు మనకు కూడా చాలా సందేహాలు కలుగుచుండవచ్చును. అది మనకు అసౌకర్యంగా లేదా గందరగోళంగా ఉండవచ్చును, కానీ మనకు సరియైన మార్గము కోసం దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవాలి. ఈ చివరి అప్పము తర్వాత మనం జీవించలేమని ఆ విధవరాలు భావించి, ఈ చివరి క్షణములోనై ఆ దైవజనుని మాటకు విధేయత చూపిస్తాను మరియు దేవుడు మన పట్ల ఏమి జరిగిస్తాడో చూద్దాం అని తనను తాను ఆదరణ మాటలతో ఊరడించుకొని, తనలో ఉన్న కొంత విశ్వాసముతో బయటపడటానికి ఎన్నుకొనెను. కాబట్టి, యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు విధవరాలి యింటిలో అద్భుతమును జరిగించాడు.

కొన్ని సంవత్సరాలు క్రితము, మాది చాలా చిన్న కుటుంబము. అయితే, మా వరకు మేము స్వల్ప ఆహారమును మాత్రమే సిద్ధము చేసుకొన్నాము. ఆ సమయములో మా సహోదరి కూడ మాతో కూడ ఉండెను. ఆకస్మాత్తుగా, అనుకోని రీతిగా అతిధులు మా యింటికి వచ్చారు. ఏమి చేయాలో మాకు తెలియలేదు. మేము సిద్ధము చేసుకొన్న ఆహారము మీద చేతులుంచి ప్రార్థన చేసి, వడ్డించుటకు ప్రారంభించాము. ఎంతటి ఆశ్చర్యకరమో! ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నటికిని విడువడు అని చెప్పిన వాగ్దానము వందశాతము నమ్మదగినది. ఆలాగుననే, మా యింటికి వచ్చినవారందరు సంపూర్ణంగా తృప్తిగా భోజనము చేసి వెళ్లిపోయారు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో దేవుడు ఎలా అద్భుతము జరిగించాడని మా సహోదరి కూడ ఎంతగానో ఆశ్చర్యపొందినది. అవును, ప్రభువు తప్పకుండా అద్భుతము జరిగిస్తాడు. ఇది ఒక సర్వసాధారణమైన సంఘటనగా ఉన్నను, ప్రభువు మా పట్ల చేసిన అద్భుతమును నేను ఎన్నటికిని మరచిపోలేను. అవును, దేవుని ప్రేమ, ఆదరణ లేనివారికిని మరియు విధవరాలి పట్లను, ఇంకను కన్నీటితో ఉన్న స్త్రీలకు తన హస్తముల ద్వారా సహాయము చేయగల సమర్థుడు. కాబట్టి, నేడు మీరు ఎటువంటి స్థితిలో కూడ విసుగు చెందకుండా, దేవుని వైపు చూడండి, ఆయన తన కర్తవ్యంను జరిగించుటలో ఎప్పుడు కూడ విఫలముకాకుండా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
నా ప్రియులారా, ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదువేలమందికి పంచిపెట్టిన అదే దేవుడు నిన్న నేడు నిరంతరము మారని దేవుడై యున్నాడని (హెబ్రీయులకు 13:8) అన్న వచనము ప్రకారము ఆయన ఎన్నటికిని మారని దేవుడై యున్నాడు. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితములో అద్భుతములు జరగాలని ఎదురు చూచి యుండవచ్చును. కానీ, మీ పరిస్థితులను బట్టి, మీరు దానిని మరచిపోయి యుండవచ్చును. అయితే, మీలో ఉన్న విశ్వాసమును బట్టి, దేవుడు మీ పట్ల అద్భుతములు జరిగిస్తాడు. ప్రభువు తప్పకుండా మీ అవసరతలన్నిటిని తీర్చి, మీ విశ్వాసమును బలపరుస్తాడు. ఇటువంటి పరిస్థితులలో దేవుడు మీ విశ్వాసమును కడతాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి '' (ఎఫెసీయులకు 6:10) అన్న వచనము ప్రకారము మీరు దేవుని యొక్క మహా శక్తి మీద మీరు నమ్మకము ఉంచండి. ఆయన మహా శక్తిగలవాడు, ఆయనకు అసాధ్యమైనదేదీయు లేదు. మీ మనస్సులను కలవరపెట్టుచున్నది ఏమైయున్నది? మీ చింతలు మిమ్మల్ని ఆవరించియున్నవా? మిమ్మల్ని గురించి సమస్తమును సంపూర్ణంగా జరిగించుటకు శక్తిగల దేవుడన్న సత్యమును బట్టి, మీ జీవితములో మిమ్మల్ని ప్రోత్సహించుచున్నాను. సమాధానము మీ హృదయములను నింపుట మాత్రమే కాకుండా, దేవుని యొద్ద నుండి ఒక గొప్ప అద్భుతమును అతి త్వరలోనే మీరు చూడబోవుచున్నారు. మీరు పొందుకోబోవుచున్న అద్భుతమును నేను మీ ద్వారా సాక్ష్యమును వినవలెనని ఎదురు చూస్తున్నాను. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు, ఇరుకునందుండి దేవునికి మొఱ్ఱపెట్టినట్లయితే, దేవుడు మీకు విశాలమందు ఉత్తరమిచ్చి, ఆయన మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
కృపకు పాత్రడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

దేవా, నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా, మా కష్టాలన్నిటిని నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాము. నీవు మమ్మల్ని నీ రెక్కల క్రింద దాచుము. మా పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టినప్పటికిని నీవు మమ్మల్ని విడిపించుటకు శక్తిగలవాడవని మేము నమ్ముచున్నాము. ఇరుకునందుండి ప్రభువా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. కానీ, విశాల స్థలమందు యెహోవా మాకు ఉత్తరము దయచేయుము. ప్రభువా, నీ యొక్క మహా శక్తిని బట్టి, మేము నీ యందు బలవంతులై జీవించుటకు మాకు సహాయము చేయుము. మాలో ఉన్న విశ్వాసమును నీవు అభివృద్ధిపరచుము. దేవా, నీవు నిన్న నేడు మారని దేవుడవుగా ఉన్నావని మేము నీ యందు విశ్వాసము కలిగి జీవించుచున్నాము. మా కష్టాలన్నిటిని తొలగించి, మా పట్ల గొప్ప అద్భుతములను జరిగించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000