Loading...
Stella dhinakaran

ప్రభువు ఆత్మ మీకు తోడైయుండును!

Sis. Stella Dhinakaran
15 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ఆత్మకు ప్రభువు తోడైయుండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక '' (2 తిమోతికి 4:22) అన్న వచనము ప్రకారము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘములో ఉన్న తిమోతికి ఒక ఉత్తరము వ్రాస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న ప్రజలను ప్రోత్సాహపరచుచు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినను, మీరు స్థిరంగా దేవునిలో ఉండాలనియు, అటువంటి స్థితిలో ఆయన ఎల్లప్పుడు మీతో కూడ ఉండుననియు హామి ఇస్తూ, ఈ లేఖను పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు. మనము దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచునప్పుడు ఆయన మనలో నిలిచియుంటాడు. " యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే; యిది వరకే అది లోకములో ఉన్నది '' (1 యోహాను 4:3) అన్న వచనము ప్రకారము మన ఆత్మ యేసును ఒప్పుకున్నప్పుడు, నిశ్చయముగా, ప్రభువు ఆత్మ మనకు తోడైయుండి సమస్తమును మనము గ్రహించునట్లు చేయును. 

్రకైస్తవ జీవితంలో ఇటువంటి జీవితం ప్రధానమైనది. తనను గూర్చి యేసు చెబుతున్న సందర్భంలో, " నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను '' (యోహాను 10:30) ఆయన వలె మనము కూడ తండ్రితో ఏకమైయుండాలి. " నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు '' (యోహాను 15:4,5) అన్న వచనముల ప్రకారము ద్రాక్షావల్లిలో తీగెలు నిలిచియున్నట్లుగానే, మీరును దేవుని యందు నిలిచియుండాలని స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. ఇంత అద్భుతమైన దైవీకమైన జీవిత అనుభవం మీ జీవితంలోను కావాలని ఆశిస్తున్నారా? " అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు '' (1 కొరింథీయులకు 6:17). మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను (కొలొస్సయులకు 1:27). దీనిగూర్చి మీరు ఆయన పాదాల చెంత కూర్చొని అన్వేషించండి. 
నా జీవిత ప్రారంభం అతి సామాన్యమైనది. నేను Äౌవనురాలిగా నుండగా మా అమ్మగారు నేను చేసే పనులకు, నన్ను గద్దించేవారు. ఒకరోజు ప్రభువు తన ప్రేమచేత నన్ను దర్శింపగా, ఆనాటి నుండి అనేక లోపములతో నిండిన నా జీవితమును ఆయన సరిచేసెను. అప్పుడు నాలో నున్న చీకటి తొలగిపోయి యేసు ప్రేమలో ప్రకాశించడం మొదలు పెట్టెను (2 కొరింథీయులకు 4:6). ప్రభువు నాలో నివసిస్తు, నన్ను సరియైన రీతిలో నడిపించేవాడు. నేను ప్రభువు కుమార్తెగా మారిపోయాను (2 కొరింథీయులకు 6:16-18). నాలో కలిగిన మార్పును మా అమ్మగారు గమనించి, నన్ను గూర్చి ఎంతో గర్వించారు. ఆ తర్వాత, నా భర్త భక్తి ధ్యాన జీవితాన్ని గమనించి, నేను కూడ బైబిల్ చదవడం మొదలుపెట్టి ప్రార్థిస్తుండేదాన్ని, ఇందువలన ప్రభువు ఆత్మ నా మీదికి దిగివచ్చి దైవికమైన దీవెనలను అనుగ్రహించాడు. ప్రభువు నాలోను, నేను ప్రభువులోను ఉన్నాము. క్రమంగా సంతోషముగా ప్రభువును సేవిస్తు నా భర్తతో పరిచర్యలో నిమగ్నమైనాను. ఈనాడు నేను ఈ వృద్ధాప్యంలో కూడ ప్రభువుతో ఐక్యమై ఆయన ప్రేమలో నిలిచియున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. 

నా ప్రియులారా, ఈ సందేశము చదువుచున్న మీ జీవితాన్ని నేడే ప్రభువునకు సమర్పించుకొనండి, అప్పుడు లోపములతో నిండియున్న మీ జీవితం మార్పుచెంది, ప్రభువులో నిలిచియుంటూ, మీరు కూడ దైవీకమైన దీవెనలను పొంది భక్తి జీవితాన్ని గడపగలరు. 
Prayer:
ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

ప్రభువా, నీలో నిలిచియుండే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించుము. నిన్ను సంతోషపరిచే రీతిగా మాలో మార్పును కలిగించుము. ఒకవేళ మేము అన్ని విధాల గర్వముగా నడుచుకొనుచున్నట్లయితే, మాలో ఒక మార్పును కలుగజేయుము. ప్రభువా, నీ ఆత్మ ఎల్లప్పుడు మాతో కూడ ఉండునట్లు చేయుము. ద్రాక్షావల్లిలో మేము తీగెలుగా ఉండునట్లు నీలో నిలిచియుండే గొప్ప ధన్యతను మాకు దయచేయుము. మా జీవితాన్ని నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము. నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. అప్పుడు మేము ప్రతి కల్మషం నుండి పవిత్రులమైౖ నీకు ప్రీతికరముగా ఉండునట్లుగా మమ్ములను మార్చుము. మేము నీలో ఉండి ఫలించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుమని మిక్కిలి విధేయతతో యేసు క్రీస్తు నామమున నిన్ను వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000