Loading...
Dr. Paul Dhinakaran

దేవుని యందు భయభక్తులుగల మీరు కొనియాడబడుదురు!

Dr. Paul Dhinakaran
24 May
నా ప్రియులారా, ఈరోజు నా ప్రియమైన తల్లి సహోదరి స్టెల్లా దినకరన్‌గారి జన్మదినము! దేవుడు ఆమెను నాకు తల్లిగా ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞుడనై యున్నాను. ఆమె నాకు ఒక మార్గదర్శిగాను మరియు ఆదర్శవంతురాలుగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించుటకు ఈ లోక పయనములో ప్రతి అడుగులోను నీతివంతమైన మరియు యథార్థమైన జీవితమును జీవించుటకును మా అమ్మ మాకు ఒక గొప్ప మాదిరిగా ఉండెను. ఆమె మాకు ఏమైతే బోధించినదో, ఆమె తన జీవితములో దానిని అనుసరించినది. నిజంగా, ఆమె ద్వారా నా జీవితములో నేను దేవుని యందు భయభక్తులు కలిగి యుండుటకు కృపను చూపించాడు. నా తల్లి ఎప్పుడు చెప్పేది, మనము చేసే ప్రతి పనికి దేవుని యెదుట జవాబుదారీగా ఉంటాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆమె మాకు నేర్పించినది. ముఖ్యంగా, దేవుని వాక్యం మా చేత కంఠస్థం చేయించి, దాని ప్రకారము జీవించాలని నేర్పించెను. అంతమాత్రమే కాదు, ప్రార్థనలో పట్టుదల కలిగి యుండునట్లుగా, క్రమశిక్షణతో జీవించునట్లుగాను నాకు నేర్పించెను.

రెండవది, బాధ్యతాయుతమైన స్త్రీ: ఆమె కుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరి పట్ల తన విధులను చక్కగా నిర్వర్తించే వారు. నా తండ్రి అనారోగ్యము ఉంటూ, దుఃఖంతో బాధపడుతున్నప్పుడల్లా ఆమె ఆయనను ఓదార్చేవారు. మేము ఏంజల్‌ను కోల్పోయినప్పుడు ఆమెలో ఉన్న ఆత్మ విశ్వాసం నా తండ్రిని ప్రోత్సాహపరిచినది. ఆయన తన ఊపిరితిత్తులు పాడైపోయి రక్తంతో వాంతులు చేసుకుంటున్నప్పుడు, ఆమె విశ్వాసం ఆయనను మరణ పడక నుండి మరల పైకి లేపకలిగినది. ప్రజలు ఆయనను విమర్శించినప్పుడల్లా, ఆమె విశ్వాసం ద్వారా ప్రోత్సాహపరచుటచేత ఆయన దేవుని పరిచర్యలో స్థిరముగా నిలబడేలా చేసెను. మేము పేదరికము ద్వారా వెళ్ళినప్పుడు, ఆమె దేవుని విశ్వసించి, ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్త వహించి, ప్రభువులో నిలిచియుండుటకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆమె నా కోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. నేను ప్రభువు చేత రక్షించబడిన తరువాత కూడ ఆమె ఈ రోజు వరకు నా కోసం మరియు నా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించుచు న్నారు. కాబట్టి, మేము ఇంతవరకు దేవుని వాక్యంలో నిలబడి, ప్రభువుతో నడుస్తున్నాము. మూడవదిగా, ఆమె దైవభక్తిగల స్త్రీ: ఆమె నాకు మరియు నా సహోదరి ఏంజెల్‌కు మరియు నా పిల్లలు కూడా దేవుని వాక్యామునందు నిలిచియుండాలని నేర్పించెను. అంతమాత్రమే కాదు, ఆమె ప్రజలందరికి దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. ఆమె ఎన్నో కుటుంబాలకు ఒక ఆశీర్వాదకరముగా ఉన్నారు. ఎస్తేరు ప్రార్థన బృందం, జూనియర్ ఎస్తేరు ప్రార్థన బృందం (జెఇపిజి), యువ ఎస్తేరు ప్రార్థన బృందం (వైఇపిజి) మరియు ఆమె పుస్తకాలను రచించుట ద్వారా కోట్లాది మంది ప్రజల కుటుంబాలలో ఆనందం, ఐక్యత, శాంతి మరియు ఏకత్వాన్ని తీసుకొని వచ్చునట్లు చేయుచున్నారు. ఎటువంటి బలహీనతలో కూడ దేవుని రాజ్యము కట్టబడుటలో ఆటంకము కలుగుకూడదని ప్రార్థన మధ్యవర్తులను ప్రోత్సహించుటలో పట్టుదల కలిగియుండెను. ఇప్పటికిని దేవుడు ఆమె ఎంతో శక్తివంతముగా తన పరిచర్యలో ఉపయోగించుకొనుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రశస్తమైన ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ తల్లి మీకు ఆదరణ కర్తగా లేదని దిగులుపడుచన్నారా? ఒకవేళ నేడు మీకు తల్లి లేదని చింతించుచున్నారా? దేవుడు ఒక తల్లిగా మిమ్మల్ని ఓదారుస్తాడు. మీరు మీ పిల్లలచేత కొనియాడబడవలెననగా, మీరు చేయవలసిన కార్యమేదనగా, దేవుని సన్నిధిలో వారినిమిత్తము ప్రార్థించాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు. గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును '' (సామెతలు 31:28,29) అన్న వచనముల ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ పిల్లలు ప్రభువును విడిచిపెట్టి, అవిధేయులై వారు మొండిగా ఉండవచ్చును. వారి నిమిత్తము ప్రభువు సన్నిధిలో మీరు బతిమాలుకొనవలెను. మీ ప్రియులైన వారు అనారోగ్యంతో ఉండవచ్చును. మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఇంకను మీ మరియు మీ ప్రియులగువారి యొక్క వ్యాధి పడకను మార్చమని ప్రభువు సన్నిధిలో ప్రార్థించండి. మీ ప్రియులగువారిని మీరు కోల్పోయి ఉండవచ్చును! నేడు అటువంటి మిమ్మల్ని ఓదార్చే దేవుని గట్టిగా పట్టుకొని, మీ కుటుంబము మరియు పిల్లలు, భర్త, భార్య కొరకు మా తల్లి వలె ఉపవాసము ఉండి పట్టుదలతో ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని ఓదార్చుతాడు. ప్రభువు మా తల్లి వలె మిమ్మల్ని మారుస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, దేవుడు నా తల్లిని మాకు మరియు అనేకులకు ఆశీర్వదకరముగా ఉంచినట్లుగానే, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని కూడ ఒక తల్లివలె ఆదరించి, అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు.
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ,

నేడు, ప్రభువా, నీ దృష్టికి అంగీకారమైన జీవితమును జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. మా ప్రియులైన వారి కొరకు మరియు అవసరములో ఉన్న వారి కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, మా సాక్ష్యం ద్వారా నీవు ఎంత విలువైనవాడవని వారు అర్థం చేసుకోవాలని కోరుచున్నాము. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులైన వారిని స్వస్థపరచుము. మరియు వారి వ్యాధిపడకనుండి వారిని స్వస్థపరచి, సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించుము. ఒక తల్లి వలె మమ్మల్ని ఆదరించుటకు మంచి హృదయమును మాకు దయచేయుము. దేవా, మాలో స్థిరమైన విశ్వాసమును మాకు దయచేయుము. ప్రభువా, ఒక తల్లి వలె మమ్మల్ని ఆదరించి, నీ బిడ్డగా జీవించుటకు మాకు సహాయము చేయుము. నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకును మరియు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000