మీరు దేవునికి శక్తివంతమైన సాక్షులుగా మార్చబడెదరు. మీరు దేవుని భాష మాట్లాడినప్పుడు, మీరు దేవునితో మాట్లాడిన వారు అవుతారు మరియు మీ జీవితము ఆయనలో తీర్చిదిద్దబడినవారై మరియు మీ హృదయంలో కడగబడినవారై పరిశుద్ధంగా జీవిస్తారు.
మానవులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ, వాటిని ఎప్పుడో నెరవేరుస్తారు. ఏదేమైనా, దేవుడు తాను చేసిన ప్రతి వాగ్దానంను నెరవేరుస్తాడు. కొన్నిసార్లు, వాగ్దానం నెరవేర్చడంలో ఆలస్యంగా అనిపించవచ్చును. ధైర్యం తెచ్చుకొనండి. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు లేదా ముందుగానే చేయడు, ఆయన తగిన సమయములో తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.
మనం భక్తిగల జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే, ప్రభువు మన ఆత్మలను కాపాడుతాడు. మనము చెడు కార్యములన్నిటిని, అవరోధములను, శోధనలను ద్వేషించాలి మరియు వాటి నుండి దూరంగా పారిపోయినప్పుడు ఆయన మన ప్రాణములను కాపాడును.
యేసుకు సహాయం చేసిన అదే పరిశుద్ధాత్మ మీ బలహీనతలలో కూడా మీకు సహాయం చేస్తుందని మీరు నమ్మండి. పరిశుద్ధాత్మ బలం, యేసుక్రీస్తు బలం మీలోకి వస్తుంది, మీరు సమస్త కార్యములు జరిగించుటకు సంపూర్ణ బలమును పొందెదరు.
తరువాత ఏమి జరుగుతుందో మీరు అయోమయంలో ఉన్నారా? మీ భవిష్యత్తు ఏమిటో ఆలోచిస్తున్నారా? మీ చింతలన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చే సమయం ఇదియే. ఆయన మీ భవిష్యత్తు కోసం తన ఉద్దేశములను సిద్ధం చేసియున్నాడు, ఇది మీ ఊహకు మించిన అద్భుతమైనది.
ప్రతిరోజు ప్రార్థన మరియు బైబిల్ చదవడం చాలా ప్రాముఖ్యం. మనము ప్రభువు పాదాల వద్ద కూర్చుని, మనం ప్రతిదినము చింతలు మరియు ఉద్దేశములను ఆయన చేతుల్లోకి అప్పగించినప్పుడు మన ఉద్దేశములు సఫలమగుతాయి.
దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించినప్పుడు, అది లెక్కకు మించినది మాత్రమే కాకుండా, అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. అవును! ప్రభువు తన పిల్లలను ప్రేమించుచున్నాడు మరియు వారికి ఎల్లప్పుడూ అతిశ్రేష్ఠమైన దానిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు సిద్ధంగా ఉండండి.
మీరు ప్రభువు ఆశ్రయం కొరకు ఆయన రెక్కల క్రిందకు వచ్చి, ఆయనకు మొర్రపెట్టినట్లయితే, దేవుడు మీ ప్రతి అన్ని అవసరాలను తీరుస్తాడు. నమ్మండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు.
దేవుడు మిమ్మల్ని దైవిక ఉద్దేశ్యంతో సృష్టించాడు. దాన్ని నెరవేర్చడమే మీ లక్ష్యం. అయితే, మీ జీవితంలో దేవుని ఉద్దేశ్యం ఏమిటో మీరు కనుగొన్నారా? కాకపోతే, వినడం కొనసాగించండి, వినిన దానిని గ్రహించుకోండి మరియు దానిని సంపూర్ణమైన జీవితాన్ని గడపాడానికి నేర్పుతుంది.
మీ ప్రవర్తన ద్వారా మీరు దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు, మీ శత్రువులు కూడా మీతో సమాధానము కలిగి ఉంటారు మరియు వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు బలంగా మరియు శక్తిమంతులుగా ఉంటారు. మీరు నిశ్చయంగా విజయమును పొందుకుంటారు.