Loading...
29 Apr
1. దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.

2. ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.

3. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యంతముల వరకు తన మెరుపును కనబడజేయును.

4. దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు.

5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.

6. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

7. మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.

8. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.

9. మరుగుస్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కునుండి చలి వచ్చును

10. దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.

11. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.

12. ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును

13. శిక్షకొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును.

14. యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము.

15. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా?

16. మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?

17. దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?

18. పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?

19. మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచకయున్నది.

20. నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?

21. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడక యున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును.

22. ఉత్తరదిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనియున్నాడు.

23. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యుందురు.

24. తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.
Telugu