Loading...
08 Dec
1. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

2. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.

3. నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు.

4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.

5. నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది.

6. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
Telugu