Loading...
08 Jun
1. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి.
 
2. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి.
 
3. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు.
 
4. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.
 
5. దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరుల యెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
 
6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి.
 
7. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనుల మీద ఆయన తన దృష్టియుంచి యున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు.
 
8. జనములారా, దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.
 
9. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.
 
10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
 
11. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్పభారము పెట్టితివి.
 
12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.
 
13. దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.
 
14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను.
 
15. పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను.
 
16. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
 
17. ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.
 
18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
 
19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు.
 
20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
Telugu