Loading...
08 Apr
1.మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు విూయొద్దకైనను విూ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?

2.మా హృదయములవిూద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక విూరేకారా?

3.రాతిపలకలవిూద గాని సిరాతో గాని వ్రాయబడక, మెత్తని 
హృదయములు అను పలకలవిూద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని విూరు తేటపరచబడుచున్నారు.

4.క్రీస్తుద్వారా దేవుని యెడల మాకిట్టి నమ్మకము కలదు.

5.మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమనికాదు; మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది.

6.ఆయనే మమ్మును క్రొత్తనిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

7.మరణకారణమగు పరిచర్య, రాళ్లవిూద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖమువిూద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.

8.ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?

9.శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కలదగును.

10.అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.

11.తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.

12.తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము విూద ముసుకు వేసికొనెను.

13.మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము. 

14.మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.

15.నేటివరకును మోషే గ్రం«థము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల విూదనున్నది గాని

16.వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.

17. ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్య్రము నుండును.

18. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
Telugu