Loading...
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. (సామెతలు 28:20)
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదెకు ప్రతిగా పూదండను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. (యెషయా 61:3)
నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును (యోవేలు 2:28)
నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడు. (కీర్తనలు 92:14)
అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండ నవ్వు కలుగజేయును; ప్రహర్షముతో నీ పెదవులను నింపును. (యోబు 8:22)
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. (యెహోషువ 1:3)
కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. (కీర్తనలు 126:5)
నా మందిరమును మీ మధ్య ఉంచెదను. (లేవీయకాండము 26:11)
యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. (సామెతలు 21:31)
పునరుత్థానమును, జీవమును నేనే. (యోహాను 11:25)
సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. (రోమా 16:20)
నీవు నీతిగలదానవై స్ధాపింపబడుదువు; నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. (యెషయా 54:14)
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. (కీర్తనలు 21:3)
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. (యాకోబు 4:10)
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను సువార్త 4:14)
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, (ఎఫెసీయులకు 3:16)