Loading...
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5)
ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. (సామెతలు 13:13)
మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటౖకె దానిని చేతును. (యోహాను 14:13)
ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. (జెఫన్యా 3:15)
నలిగిన వారికి తాను మహా దుర్గమగును, ఆపత్కాలములో వారికి మహా దుర్గమగును. (కీర్తనలు 9:9)
నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల యెదుట బలమైన కోటగా నుంటివి. (కీర్తనలు 61:3)
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. (కీర్తనలు 34:5)
నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. (కీర్తనలు 89:34)
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. (యెషయా 43:2)
నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3
శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. (కీర్తనలు 91:15)
యెహోవానగు నేనే నీ చేయి పట్టుకొనియున్నాను. (యెషయా 42:7)
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా 43:4
మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. (యెహెజ్కేలు 36:11)
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. (యెషయా గ్రంథము 41:10c)