Loading...
శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. ద్వితీయోపదేశకాండము 33:27
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆదికాండము 12:2
భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. ద్వితీయోపదేశకాండము 32:13
వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. కీర్తనలు 84:7
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా 60:20
కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81:16
నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:19
ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆయన ఆపేక్షించుచున్నాడు. యాకోబు 4:5
నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. యెహెజ్కేలు 36:26
నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనలు 61:2
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు 5:16
ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తనలు 50:15
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు. కీర్తనలు 138:7
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1
ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకనుగ్రహించును గాక. ఆదికాండము 27:28