Loading...
యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును. యెహోషువ 3:5
వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. (యెషయా 60:22)
గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. (యిర్మీయా 1:5)
దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. (కీర్తనలు 46:5)
అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. (రోమా 8:37)
గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు. (కీర్తనలు 147:3)
బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. (2 కొరింథీయులకు 12:9)
ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. (1 పేతురు 5:7)
నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. (యెషయా 41:10)
యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా 60:19
నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండము 4:12
తనకు పరిచారకులై యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. (2 దినవృత్తాంతములు 29:11)
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు. (1 యోహాను 4:4)
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. (సంఖ్యాకాండము 6:25)
నా మందిరము వారికి పైగా నుండును. (యెహెజ్కేలు 37:27)