Loading...
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. యిర్మీయా 29:11
ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి 2:19
సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తనలు 51:12
నీ యందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది. కీర్తనలు 31:19
తన నామమును బట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:3
ఆయన వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు. (దానియేలు 2:21)
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. (యెషయా 40:31)
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి. కొలొస్సయులకు 3:15
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు; ఆకలి గొనినవారి ప్రాణమును మేలులతో నింపి యున్నాడు. కీర్తనలు 107:9
ఆయన సత్యము, కేడెము, డాలునై యున్నది. కీర్తనలు 91:4 
నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు. యిర్మీయా 31:14
యెహోవా నామము బలమైన దుర్గము; నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతలు 18:10
ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. ద్వితీయోపదేశకాండము 11:25
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8
నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. యోవేలు 2:25
ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. 1 దినవృత్తాంతములు 29:12