Loading...
నా మందిరము వారికి పైగా నుండును. (యెహెజ్కేలు 37:27)
నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. (యెషయా 45:2)
పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. (యెహెజ్కేలు 20:41)
మీ జీవము క్రీస్తుతో కూడ దేవుని యందు దాచబడియున్నది. (కొలొస్సయులకు 3:3)
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. (కీర్తనలు 103:2)
వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. (యెషయా 65:24)
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5)
ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. (సామెతలు 13:13)
మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటౖకె దానిని చేతును. (యోహాను 14:13)
ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. (జెఫన్యా 3:15)
నలిగిన వారికి తాను మహా దుర్గమగును, ఆపత్కాలములో వారికి మహా దుర్గమగును. (కీర్తనలు 9:9)
నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల యెదుట బలమైన కోటగా నుంటివి. (కీర్తనలు 61:3)
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. (కీర్తనలు 34:5)
నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. (కీర్తనలు 89:34)
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. (యెషయా 43:2)