Loading...
నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1
...నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను. యోహాను 14:27
నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా 3:20
క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు 3:14
నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించునుంటిని. సామెతలు 8:30
ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. 1 కొరింథీయులకు 2:10
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు 18:24 
నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను. యోహాను 17:10
ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. లూకా 12:48
యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. కీర్తనలు 25:21
మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురు. యోహాను 1:51
మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురు. యోహాను 1:51
నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. లేవీయకాండము 20:8
యెహోవా సాధువులును కాపాడువాడు. కీర్తనలు 116:6
నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను; నీ పిల్లలను నేనే రక్షించెదను. యెషయా 49:25
నా జనులు ఇకనెన్నడును సిగ్గునొందక యుందురు. యోవేలు 2:27