Loading...
యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనలు 11:7
నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సామెతలు 28:14
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 28:8
మీరు చేసిన కార్యమును...తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. హెబ్రీయులకు 6:10
ఒకడు న న్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యోహాను 14:23
తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. కీర్తనలు 103:13
నా శత్రువులు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు. కీర్తనలు 55:18
మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అపొస్తలుల కార్యములు 17:28
దేవుడు యథార్థవంతుడు; యెహోవా వాక్కు నిర్మలము; తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. కీర్తనలు 18:30
మనమందరమును మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీయులకు 3:18
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా 54:7
ఆయన నామము నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది. యిర్మీయా 20:9
దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. కీర్తనలు 60:12
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15:8
మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. సామెతలు 14:22
I will sing the Lord’s praise,for he has been good to me. (Psalm 13:6)