Today's Promise & Prayer
Today's Promise Banner
మీ ఆశీర్వాదం కొరకు నూతన పరిచర్యలు ప్రారంభం!
మీ కొరకే ప్రార్థనలు ప్రారంభం!



ఈ సంవత్సరం ఆశీర్వదంగా ఉండటానికి మీకు అవకాశము - 2021
యౌవన భాగస్థుల పధకము
బైబిల్లో, తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను, రెండు చేపలను దేవునికిచ్చి, ఆయన దానిని ఆశీర్వదించి, ఆయన బోధను వినడానికి గొప్ప జనసమూహముగా కూడి వచ్చిన ఐదువేల మందికి పైగా ఆహారం ఇచ్చి పోషించుట ద్వారా ఈ చిన్న పిల్లవాడు వేలాది మందికి ఆశీర్వాదంగా మారెను. అదేవిధంగా, మీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విరిగినలిగిన ప్రజలకు హృదయ పూర్వకంగా గొప్ప ఆశీర్వాదంగా మారవచ్చును.
ఇంకా చదవండికుటుంబ ఆశీర్వాద పధకం
ఈ భూమిపై దేవుడు సృష్టించిన మరియు ఆశీర్వదించిన మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థ. ఈ కారణంగానే, కుటుంబాలలో దేవుని ప్రేమను స్థాపించడం ద్వారా కుటుంబాలను ఒకే చోట కలుసుకొనుటకును యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఎంతో కృషి చేయుచున్నది. దేవుడు తన దైవిక కృప మరియు దయచేత కుటుంబాలను విఫలం చేయలేని ప్రేమ బంధములతో ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి, కుటుంబాల కోసం మా ప్రార్థనలు నిరంతరము కొనసాగుతాయి.
ఇంకా చదవండిఉద్యోగ ఆశీర్వాద పధకం
శ్రమించే ప్రజలైన మీరు తాము చేయుచున్న పనులలో ఉన్నత స్థానము, ఘనత మరియు ఆశీర్వాదం పొందుకొని అనుభవించడానికి, దేవుని యొక్క మరియు మానవుని దయ ద్వారా నమోదు చేసుకొను ప్రతి వ్యక్తి, వారి యొక్క ప్రయత్నములన్నిటిలోను ఆశీర్వదింపబడుటకు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం, " ఉద్యోగ ఆశీర్వాద పధకమును " ప్రారంభించబడినది. ప్రతి వ్యక్తి, వారి ప్రయత్నాలన్నిటిలోను, ఇంకను వారి చేతుల కష్టార్జిమంతటిలోనూ అభివృద్ధి చెందునట్లుగాను మరియు బైబిల్లో యోసేపు అనుభవించిన విజయానికి సాక్షిగా ఉండునట్లుగా త్వరగా, ఈ పధకములో నమోదు చేసికొని, సంపూర్ణమైన ఆశీర్వాదాలను అనుభవించండి.
ఇంకా చదవండిప్రార్థన అకాడమీ మరియు శిక్షణ
ప్రార్థన అకాడమీ మరియు శిక్షణలో " యేసును తెలుసుకొనుట '' అను అంశముపై ఆన్లైన్ కోర్సును అందిస్తుంది, యేసును సన్నిహితంగా తెలుసుకోవటానికి, యేసులో జ్ఞానాన్ని పెంచుకోవటానికి, ఆయన బోధనలను అనుసరించడానికి మరియు దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు ఇతరుల జీవితాలలో ఆయన యొక్క వాక్యాన్ని విత్తడానికి భాగస్థులగుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. ఈ పధకములో నమోదు చేసుకున్న వారికి పరస్పర సంభాషణల సెషన్లు, క్విజ్లు మరియు అసైన్మెంట్ల ద్వారా డాక్టర్. పాల్ దినకరన్గారు మరియు యేసు పిలుచుచున్నాడు సిబ్బందులు శిక్షణ ఇస్తారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభువును తెలుసుకోవటానికి సరికొత్త అవకాశం.
ఇంకా చదవండివ్యాపార ఆశీర్వాద పధకము
" సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును '' అని బైబిలు సెలవిచ్చినట్లుగానే యేసు పిలుచుచున్నాడు పరిచర్య ప్రతి వ్యాపారస్థుని యొక్క విజయం కోసం నిరంతరం ప్రార్థించే ప్రార్థన యోధుల ప్రత్యేక బృందాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రణాళికకు మీరు నమోదు చేసుకొనుట ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించడంలోను మరియు అభివృద్ధిని కలిగించుటకు సహాయపడుతుంది. అయినప్పటికిని, దేవుడు హృదయపూర్వకంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు.
ఇంకా చదవండిఇశ్రాయేల్ ప్రార్థన గోపురము
యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో మనం చేయునది ప్రపంచం కొరకు ప్రార్థించడం. అటువంటి గొప్ప పరిచర్యలో, క్రీస్తు యొక్క కనికరముతో దీన్ని చేయడమే లక్ష్యంగా కలిగియున్నాము. దేవుని ప్రణాళిక ప్రకారం, మేము ఇశ్రాయేల్ దేశంలో ప్రార్థన గోపురమును ప్రారంభించియున్నాము. ప్రార్థన యోధులు అక్కడ నుండి దేశాల కొరకు మరియు ప్రజల కోసం ప్రభువును ఆహ్వానించి ప్రార్థించుచున్నారు, దేవుడు వారికి ఇచ్చే దర్శనములను మరియు ప్రవచనాలను నిజంగా ఊహించలేము.
ఇంకా చదవండిటెలిఫోన్ ప్రార్థన గోపురం
అందుబాటులో ఉన్న ఈ సేవ ద్వారా ఏ క్షణంలోనైన ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్న యేసు పిలుచుచున్నాడు సేవా పరిచర్య యొక్క అతిప్రాముఖ్యమైన సూత్రం మరియు అర్హతయై యున్నది. యేసు పిలుచుచున్నాడు పరిచర్య యొక్క విభాగాలలో టెలిఫోన్ ప్రార్థన గోపురము ఒకటి, ప్రార్థన గోపురంలో ప్రార్థన కోరుకునే ప్రతి ఒక్కరికి నిరంతర ప్రార్థనలు చేయబడును.
ఇంకా చదవండిబేతెస్ద ప్రార్థన కేంద్రం
చాలామంది బేతెస్ద ప్రార్థన కేంద్రాన్ని యాత్ర ప్రదేశముగా భావిస్తారు. ఏది ఏమయినప్పటికీ, ఇది యాత్రకు కేంద్రీకృతమైనది కాదు, ధ్యానం చేసే ప్రదేశంగా ఉన్నది, ఇక్కడ చాలామంది క్రీస్తుయేసులో తమ గుర్తింపును తెలుసుకోవడానికి ఇక్కడ ధ్యానం చేయుటకు ఈ స్థలమును దర్శిస్తారు.
ఇంకా చదవండిపత్రికా క్లబ్
కాగితంపై ప్రభావం చూపుతున్న పదాలు ఎలాగా లోతుగా జీవిస్తాయో మరియు యేసు పిలుచుచున్నాడు పత్రిక తప్పకుండా దాని కంటే ఎక్కువగా క్రియ చేస్తుంది! ఇది సమస్యల ద్వారా నలిగియున్న ఆత్మలను దేవుని వైపునకు నడిపించుటకు మరియు వారిలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. నిరీక్షణను కలిగించుచున్న ఈ ఆకులు, వారు ఎక్కడ ఉన్నా ప్రజలకు చేరుతాయి మరియు సంవత్సరమంతయు ఆధ్యాత్మికంగా నడుచుటకు వారికి తోడుగా ఉంటాయి.
ఇంకా చదవండిటెలివిజన్ క్లబ్ భాగస్థులు
యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రజలందరి వద్దకు తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా పనిచేయుచున్నది. మేము దేవుని రాజ్యం యొక్క అభివృద్ధి కోసం ప్రతి కార్యక్రమమును ఉత్తమంగా ఉపయోగించుచున్నాము. యేసుక్రీస్తు ప్రేమను పంచుకోవడానికి మీ బాధ్యతను గుర్తించడానికి మీరు టి.వి. క్లబ్లో భాగస్థులుగా చేరవచ్చును.
ఇంకా చదవండి