Loading...
Evangeline Paul Dhinakaran

శాశ్వతమైన ప్రేమతో మిమ్మును ప్రేమించే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
11 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల దేవుడు శాశ్వతమైన ప్రేమను కలిగియున్నాడని మీరు నమ్మండి. ఈ లోకములో మన పట్ల అంతగా ప్రేమను చూపు వారు ఎవ్వరు ఉండరు. కానీ, మన దేవుడు నిత్యము నిలిచియుండు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. " శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను'' (యిర్మీయా 31:3) అన్న వచనము ప్రకారము ఆయన ప్రేమ చూపుట మాత్రమే కాదు, మీ యెడల తన యొక్క కృపను చూపుచున్నాడు. దేవుడు తన బిడ్డల పట్ల చూపే ప్రేమను వారు అర్థము చేసుకోకపోవచ్చును. కానీ, ఆయన తన బిడ్డలను విడువక ప్రేమించుచున్నాడని మనము మరచిపోకూడు. ఒకవేళ మీరు దేవుని చిత్తాన్ని జరిగించే వారైతే, దుష్టశక్తుల నుండి కాపాడుటకు ఆయన ప్రేమ మిమ్మును ఆవరించి యుండును. కాబట్టి, ఈ లోకములో మీకు కలిగే శ్రమలను మరియు వ్యాధులను చూచి నిరుత్సాహపడకండి. మన దేవుడు కరుణాసంపన్నుడై యున్నాడు. ఆయన మిమ్మును విడువక తన యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. మీ ప్రేమ ఆయన పట్ల ఏలాగున ఉన్నదని మిమ్మును మీరు ఒకసారి పరిశీలించుకొనండి. మిమ్మును సరైన మార్గములో వెళ్లనివ్వకుండా చేయు అపవాదికి మీ హృదయములో చోటివ్వకండి. మీరు జీవముగల దేవుని యందు మాత్రమే నిరీక్షణ కలిగియుంటూ, ఆయన ప్రేమలో మాత్రమే నిలిచి యుండండి. 

యేసు పిలుచుచున్నాడు కూటాలను నిర్వహించుటకు మేము కుటుంబ సమేతముగా అమెరికా దేశమునకు వెళ్లాము. ఆ కూటాలు ముగిసిన తరువాత, మేము ఒక వింత ప్రపంచమును చూడడానికి ప్రదర్శనశాలకు వెళ్లాము. అక్కడ మాజీ అధ్యక్షుల యొక్క మైనపు నమూనాలు ప్రదర్శింపబడుచుండెను. ఆ ప్రదర్శనలో తమ అధ్యక్షుల నమూనాలను ప్రేక్షకులు చూచినప్పుడు, వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. వారు పొందుకున్న సంతోషాన్ని చప్పట్లు కొట్టి వ్యక్తపరిచారు. ఆ ప్రదర్శన ముగిసిన తరువాత, వారందరు తమకు ఇష్టమైన అధ్యకుల ప్రేమను కోల్పోయినందుకు చాలా విచారించారు.
నా ప్రియులారా, ఈ లోకములోని ప్రేమ అటువంటిదై యున్నది. వారి అధ్యక్షుల నమూనాలు సజీవంగా కనిపించినంతవరకే వారు సంతోషించారు, ప్రజలపై వారు చూపించిన ప్రేమను జ్ఞాపకము చేసుకొన్నారు. కానీ, మన దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. మీరు దేవుని యొక్క విస్తారమైన ప్రేమను గుర్తించగలిగినట్లయితే, ఆయన ప్రేమ మిమ్మల్ని రక్షించి, మీకు సరైన మార్గదర్శకత్వమును చూపునట్లు మిమ్మును నడిపిస్తాడు. అప్పుడు మీలో దేవుని ప్రేమను కలిగియున్నారనే విషయమును మీరు ఎంతో సున్నితంగా గుర్తించగలుగుతారు. ఒకవేళ మీరు చీకటి లోయగుండా వెళ్లుచున్నట్లయితే, ఆయన మీ పట్ల ఎంతో ప్రేమకలిగియున్నాడని గుర్తుంచుకొనండి. ఆయన ప్రేమ ద్వారా మీ శ్రమల నుండి మిమ్మును విడిపించి, తన యొక్క శాశ్వతమైన ప్రేమ చేత మిమ్మును సంరక్షించి ఆశీర్వదిస్తాడు. 
Prayer:
ప్రేమకు పాత్రుడవైన మా గొప్ప తండ్రీ, 

నిన్ను ప్రేమించుచున్నాము. నీ యొక్క శాశ్వతమైన ప్రేమ చేత నీవు మమ్మును ప్రేమించుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీ ప్రేమలో ఎటువంటి షరతులు ఉండవు. కానీ, మానవుని యొక్క ప్రేమ ఎన్నో షరతులతో నిండి యుంటుంది. కావుననే, మేము మానవుల ప్రేమ వైపు వెళ్లకుండా, మా దృష్టిని నీవైపు మళ్లించుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. దేవా, నీ యొక్క సున్నితమైన ప్రేమను మేము గుర్తించగలిగే కృపను మాకు దయచేయుము. దేవా, ఈ లోకములోని ప్రేమకంటే, నీ యొక్క శాశ్వతమైన ప్రేమ యందు నమ్మిక కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000