Loading...
Stella dhinakaran

మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టే దేవుడు!

Sis. Stella Dhinakaran
16 Apr
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థానమునకు హెచ్చించుటకు కోరుచున్నాడు. బైబిల్లో చూచినట్లయితే, " ...ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను '' (యెహోషువ 3:7) అను ఈ వచనము యెహోషువ అను దైవజనునికి యెహోవా దేవుడు ఇచ్చిన మంచి వాగ్దానపు వచనము. నా ప్రియులారా, యెహోషువ తన జీవితమును దేవుని యెదుట నీతిగాను మరియు యథార్థముగాను ప్రత్యక్షపరచుకొనెను. అతడు మోషేతో కూడ ఉండెను. దేవునికి ప్రయోజనకరమైన దానిని భయభక్తులతోను నెరవే ర్చి ముగించెను. కావుననే, " నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును '' (సామెతలు 28:20) అని చదివినట్లుగానే, పరిపూర్ణ ఆశీర్వాదములను దేవుని యొద్ద నుండి అతడు పొందుకొనెను. 

దీనినే మనము ద్వితీయోపదేశకాండము 28:1లో చూచినట్లయితే, " నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును '' అని చదువుచున్నాము. బైబిల్ను క్షుణ్ణంగా ధ్యానించి, దాని ద్వారా దేవుని యొక్క కట్టడలు ఏమైయున్నవో గ్రహించుకొనుట ఎంతో ప్రాముఖ్యమైన కార్యమైయున్నది. దీనిని మనము అనుదినము గైకొనవలెనని దేవుని యొక్క చిత్తమైయున్నది. అదేవిధంగా, ఆయన యొక్క నడిపింపు కొరకు కనిపెట్టుకొనియుంటూ, దాని ప్రకారము నడుచుకున్నప్పుడు, యెహోవా మన యందు ప్రీతిగలవాడైయుంటూ భూమి మీదనున్న సమస్త జనములకంటె మనలను హెచ్చించునని మనము అనుభవించి తెలుసుకొనవలెను. 

క్రీస్తునకు ఎంతో ప్రియమైన యౌవనస్థుడు ఒకడుండెను. తన యొక్క పనిలో ఎంతో యథార్థముగాను, నీతిగాను ఉండెను. క్రీస్తులో కలిగియున్న గుణాతిశయములు అతనిలో కనబడెను. అతడు ఎంతో నీతిగా పనిచేయుట చూచిన అతని యొక్క యజమానుడు, గుమస్తా, కారణములేకుండా, అతనిని వేదించుచుండెను. అయితే, ఆ యౌవనస్థుడు, తాను పనిచేయుచున్న కార్యాలయములో ఉన్నత స్థానము కొరకు పరీక్షలు వ్రాయుచు, ఉత్తీర్ణుడగుచు, యుక్త వయస్సులోనే ఉన్నత అధికారిగా హెచ్చింపబడే భాగ్యమును పొందుకొనెను. అతి త్వరలోనే ఆ యౌవనస్థుడు హెచ్చింపబడెను. అయితే, అతనికి విరోధముగా లేచిన గుమస్తా, ఉన్న స్థలము కనిపించకుండా పోయాడు. 
అవును, నా ప్రియులారా, మనము ఘనతను పొందాలంటే, వినయము కలిగియుండాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును '' (సామెతలు 15:33). కావుననే, ప్రభువునకు భయపడుచు, ఆయన యెదుట యథార్థముగాను, నీతిగాను నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ తప్పకుండా దేవుని యొద్ద నుండి ఇటువంటి దైవీకమైన ఘనతను పొందుకొనుట నిశ్చయమైన కార్యముగా ఉంటుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ఆజ్ఞలను గైకొనుచు, కట్టడలకు లోబడి జీవించుచు, మిమ్మును మీరు ఆయన యెదుట తగ్గించుకొన్నట్లయితే, నిశ్చయముగా, మీ చుట్టు ఉన్న వారందరు మిమ్మును ఎరుగునట్లు ప్రభువు వారి కన్నుల యెదుట మిమ్మల్ని గొప్పచేయ మొదలుపెట్టుట మీరు చూచెదరు. అంతమాత్రమే కాదు, మీ వినయమును చూచి దేవుడు నేటి నుండి మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. 
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ, 

ప్రభువా, నిన్ను నమ్మిన నీ బిడ్డలైన మాతో కూడ నీవు ఉండి ఆశీర్వాదములను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. నీ యొద్ద నుండి వచ్చు ఘనత మాకు దొరుకునట్లు చేయుము. దేవా, నీ యెదుట భయభక్తులతోను, యథార్థతతోను మమ్మల్ని మేము నీ సన్నిధిలో తగ్గించుకొని, ప్రార్థనా తలంపుతో జీవించుచు, నీవు అనుగ్రహించు ఘనతను పొందుకొనుటకు కృపను దయచేయుము. దేవా, నీ యొక్క దివ్య హస్తమును మా మీద ఉంచి, మమ్మల్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000