Loading...
Stella dhinakaran

మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించే దేవుడు!

Sis. Stella Dhinakaran
11 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు నడువవలసిన మార్గమును మీకు బోధిస్తాడు. అంతమాత్రమే కాదు, ఎల్లప్పుడు మీ మీద తన దృష్టిని నిలుపుతానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి యుంచి నీకు ఆలోచన చెప్పెదను '' (కీర్తనలు 32:8). అనుదినము దేవుడు మీ జీవితములో అనుగ్రహించిన ఆశీర్వాదములను లెక్కించి, ప్రభువును స్తుతించండి. ఈ విధంగానే దావీదు కూడ చేశాడు. " యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు '' (కీర్తనలు 40:5) అని దేవుని స్తుతించాడు. ఆలాగుననే, మన జీవితంలో ప్రభువు చేసిన ఆశ్చర్యక్రియలు అపారం. యోబు అనుభవంలో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు లెక్కింపలేమని సెలవిస్తున్నాడు. కనుకనే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు లెక్కింపలేమని సెలవిస్తున్నాడు. కనుకనే మీరు ప్రభువు చేసిన ప్రతి మేలును లెక్కించి, దీవెనలను బట్టి స్తుతులు చెల్లించుము. ఈ విధంగా మీరు చేస్తే ప్రభువు ఇంకా ఇంకా అనేకమైన మంచి మేలులతో మిమ్మును సమృద్ధిగా నింపుతాడు. 

ఒకానొక భక్తిగల తల్లి తన పిల్లలకు చిన్నప్పటి నుండే భక్తి భావాలను నూరిపోసింది. ప్రతి విషయానికి వందనాలు చెల్లించమని చెప్పింది. ఒక పెన్సిల్ కొంటే దాన్ని బట్టి ప్రభువునకు వందనాలు చెల్లించేది. క్రొత్త బట్టలు కొంటే, ఆదివారం చర్చికి వేసుకుని ప్రభువునకు వందనాలు చెల్లించమని చెప్పేది. ఈ విధంగా నేర్పించిన పద్ధతి చిన్న కుమార్తెకు బాగా అలవడింది. " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును '' (యెషయా 60:22). ఈ వాగ్దాన వచనం ప్రకారం, ఆమె ఆత్మలోను, మనస్సులోను, శరీరంలోను ఎంతో అభివృద్ధి చెందింది. ఆమె ప్రభువు కోసం ప్రకాశించింది. 
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయుచున్న సమస్త కార్యములలోను దేవుని యొక్క కృపను మీరు గుర్తించుటకు ప్రభువు మిమ్మును అద్భుతమైన మార్గములలో నడిపిస్తాడు. ప్రభువు చేసిన అనేక అద్భుత క్రియలను లెక్కించి వాటిని జ్ఞాపకము చేసుకొనవలెను. ఆయన మీకు ఉదేశము చేయుచు, మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించుచున్నాడు. ఆయన ఆలోచనల కొరకు మీరు ఆయనకు స్తుతులు చెల్లించండి, ఆయన అనుగ్రహించిన ఆలోచనల ప్రకారము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఆయన మీ పట్ల ఎంతగానో సంతోషిస్తాడు. ఒకరి జీవితములో జీవము కలుగునట్లు ప్రకటించేవారును మరియు మీ కొరకు దేవుని ఉద్దేశములను ప్రవచించే వారును మీ చుట్టు ఉండునట్లు దేవుడు సహాయము చేయును. మీరు కూడ మీ చుట్టు ఉన్నవారికి అదే విధంగా ఆశీర్వాదకరముగా ఉండెదరు. దేవునితో అధిక సమయము గడపండి మరియు ఆయన మిమ్మును పరిశుద్ధాత్మ వరములతో నింపును. మీరు నశించిపోవుచున్న అనేకులకు వెలుగు చూపే దీపస్తంభముల వలె ఉందురు. 
Prayer:
మా పట్ల అద్భుతకార్యాలు జరిగించే మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీ సంగతుల విషయమైన ఆసక్తి కలిగియుండి, నిన్ను స్తుతించుటకు మాకు కృతజ్ఞతా హృదయాన్ని దయచేయి. నీ పాదాలను ఆశ్రయించి, కృతజ్ఞతతో జీవించునట్లు కృప జూపుము. ఈనాడు సరైన మార్గము తెలియని మాకు నీవు మేము నడువవలసిన మార్గములో నడుచునట్లు మాకు బోధించుము. మా జీవితములో ఏమి చేయాలో మాకు నీ ఉపదేశములను మరియు ప్రణాళికలను బోధించుము. ప్రభువా, మేము ఎదురు చూచు కార్యముల పట్ల నీవు గొప్ప అద్భుతాన్ని జరిగించుము. అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మును మార్చుము. మేము వెళ్లు మార్గము సరియైనదా? కాదా? అని మాకు బోధించే ఆత్మను దయచేయుమని యేసుక్రీస్తు అద్భుత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000