Loading...
Dr. Paul Dhinakaran

మీకు సంపూర్ణమైన దైవీక కాపుదలను ఇచ్చే దేవుడు!

Dr. Paul Dhinakaran
08 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు విరోధముగా లేచువారు, మీ మధ్యన ఇకను సంచరించరని వాక్యము తెలియజేయుచున్నది. " వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను '' (నహూము 1:15) అన్న వచనము ప్రకారం " వ్యర్థుడు '' లేక " దుర్మార్గులు '' అని ఎవరిని సూచించుచున్నది? " దుర్మార్గులు '' అను వ్యక్తులను గుర్తించడానికి బైబిల్లో అనేక వచనములు మనకు సహాయపడుచున్నవి. ఉదాహరణకు, చెడ్డవారైన వారి యొక్క పాత్రలను లేక గుణాతిశయములను 2 తిమోతి 3:2 వచనములో మనకు వివరించుచున్నది. " ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. '' అయితే, కీర్తనాకారుడు చెప్పిన ప్రకారము, ఇందులో దుర్మార్గులను గురించి, ' గర్వం మరియు అహంకారము ' అను రెండు లక్షణములను కలిగియున్నవనియు క్లుప్తముగా వివరించబడినది. " దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురు గాక '' (కీర్తనలు 10:2-11). కానీ, దేవుడు మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు. ఇంకను ఆయన మనలను నాశనము చేయడు, కనుకనే, ఆయన వాగ్దానము చేసినట్లుగానే, మనలను సంపూర్ణంగా కాపాడుతాడు. 

మరియు, బైబిల్లో వ్రాయబడినట్లుగా, " యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును '' (నహూము 1:7) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యందు నమ్మకముంచినప్పుడు, దేవుని యొక్క దైవీకమైన కాపుదలను అనుభవిస్తారు. మీ మధ్యనున్న ఆశీర్వాదము, ఇతరులను సువార్త వైపు ఆకర్షించును. 

ఒక మాంత్రికుడు, ఒక దైవ సేవకుడు వీధులలో సువార్త ప్రకటించుట చూచి, కోపగించుకొనెను. కనుక, అతను మరియు అతని స్నేహితులు కలిసి ఆ దైవ సేవకుని మీద విషపూరితమైన నాగుపామును విసిరారు, ఆ పామును చూచి, అక్కడ కూడి వచ్చిన వారందరు పారిపోయారు. కానీ, ఆ దైవజనుడు మాత్రమే ఆ మాంత్రికునిపై కోపపడక, అతను రక్షణ పొంది, దేవుని వెలుగులోనికి రావలెనని ప్రార్థించాడు. రోజులు గడిచిపోయినవి. ఒకరోజు, ఒక యౌవనస్థుడు ఈ మాంత్రికుని వద్దకు వచ్చి, ఒక అమ్మాయికి వ్యతిరేకముగా చేతబడి చేయమని చెప్పి, 500 రూపాయలు ఇచ్చాడు. ఆ మాంత్రికుడు మంత్రములు చదివినప్పుడు, యేసు అతని యెదుట ప్రత్యక్షమై , " ఈమె నా కుమార్తె నీవు తనను ఏమీ చేయలేవు '' అని చెప్పాడు. దేవుని చూచిన ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత అతను దేవుని యందు విశ్వసించి, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అతను ప్రతి స్థలములోను సువార్త ప్రకటించుచున్నాడు.
ఎంత గొప్ప మార్పు కదా! అంధకార లోకములోను మరియు అంధకార శక్తులతో అటలాడుచున్న ఒక వ్యక్తి యేసును దర్శించగానే మారుమనస్సు పొందాడు. నా ప్రియులారా, ప్రకృతి వైపరిత్యాలు, రోగములు, అంధకారశక్తుల నుండి కాపాడబడుట నిజంగా గొప్ప ఆశీర్వాదము. మీ చుట్టు ఉన్న కాపుదల, ఇతరులను యేసు వైపు ఆకర్షించును. దేవుని కాపుదలలో ఆశీర్వాదకరముగా ఉండుడి! దేవుడు మీకిచ్చిన దైవీకమైన కాపుదలను మరియు ఆశీర్వాదములను ఆనందించండి. దేవుడు మిమ్మును దీవించును గాక!
Prayer:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ,

అన్నివేళల నీ యొక్క అద్భుతమైన కాపుదల నిమిత్తము నీకు స్తోత్రములు. నీ నామము మాకు ఆశ్రయము. మాకు వ్యతిరేకముగా, రూపింపబడు ఏ ఆయుధము వర్థిల్లదని మేము విశ్వసించుచున్నాము. దేవా, మా చుట్టు ఉన్న ప్రజలు నీ సువార్త వైపునకు ఆకర్షింపబడుటకు మాలో ఉన్న అంధకార శక్తులను నీ వెలుగు ద్వారా తొలగించుము. ప్రభువా, నీవు ఉత్తముడవని రుచి చూచి తెలుసుకొనుటకును మరియు నీ యందు నమ్మిక యుంచుటకును మాకు అటువంటి హృదయమును దయచేయుము. నీవు మాకు దైవీకమైన కాపుదలను అనుగ్రహించుము. నీవిచ్చు దైవీకమైన కాపుదలను మేము ఆనందించుట చూచిన అనేకులను నీ యొక్క రక్షణ వెలుగులోనికి నడిపించుటకు మాకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000