Loading...
Stella dhinakaran

మీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు!

Sis. Stella Dhinakaran
15 Mar
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలకు దేవుడు జవాబివ్వాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే " ... భయపడకుము; నీ ప్రార్థన వినబడినది...'' (లూకా 1:13) అన్న వచనము ప్రకారము సమస్యలు, ఇబ్బందులు మరియు వేదనలు మీ జీవితాలను ఒత్తిడికి గురి చేసినప్పుడు మరియు భయంకరమైన కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, మీరు భయభక్తులతో ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, ప్రభువు మీ ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు. ఆయన మీ సమస్యల నుండి విడిపించి, మిమ్మల్ని రక్షిస్తాడు. తుఫాను వంటి కష్టాలు మన జీవితాలను చుట్టుముట్టినప్పుడు, దేవుని యందలి భయముతో మనం ప్రభువుకు మొఱపెడితే ఆయన వెంటనే మనకు జవాబును దయచేసి, మనలను ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. కానీ, దైవ భయాన్ని దైవ జ్ఞానాన్ని త్రోసివేసి నిర్ల్లక్ష్యం చేస్తే, ఆయన మాటలను పెడచెవిని పెడితే, ప్రభువు మన ప్రార్థన ఆలకించడు. జవాబు ఇవ్వడు. ఆయన మన పట్ల మౌనము వహిస్తాడు. " భయము మీ మీదికి తుఫానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను '' (సామెతలు 1:27-29) అన్న వచనముల ప్రకారము, ప్రభువునకు భయపడుట అనగా, ఆయన వాక్యమును లక్ష్యపెట్టుట మాత్రమే కాకుండా, ఆయన ఆజ్ఞల యందు ఆనందించినప్పుడు, నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. 

ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబం ఉండేది. వారు భోగభాగ్యాలకు కొదువలేకుండా, ఇష్టానుసారంగా జీవించేవారు. వారు చర్చికి వెళ్లరు. ప్రార్థన చేసుకోరు. కేవలం లోక సౌఖ్యాలకు వెంపర్లాడేవారు. పేరుకు మాత్రమే క్రైస్తవ్యం మచ్చుకైనా లేని కుటుంబం. జాయిస్, వారి కుమార్తె కాలేజిలో చదివేది. తన క్లాస్‌ లో తోటి విధ్యార్థిని ఎంతో ప్రత్యేకంగా కనిపించేది. చదువులో ముందుండేది. ఎంతో తెలివైనది, సౌమ్యురాలు. ఆ అమ్మాయి పాస్టరు గారి కుమార్తె, వారు ఎల్లవేళల ప్రభువును వెంబడించేవారు. ప్రభువు వారిని బహుగా దీవించాడు. ఈ జాయిస్ ఒకరోజు తన తోటి విధ్యార్థినియైన ఆ పాస్టరుగారి కుమార్తెను నీ విజయానికి రహ్యమేంటని అడిగి తాను ఏ విధంగా బైబిలు చదివి, ప్రార్థన చేసుకుంటుందో విశదంగా తెలుసుకొనినది. జాయిస్ కూడ క్రమంగా బైబిలు చదవడం అలవాటు చేసుకొని ప్రార్థించడం మొదలు పెట్టింది. ఆమె కూడ రక్షణ పొందింది. జాయిస్‌ లో వచ్చిన మార్పును కుటుంబీకులు గమనించి, తమ తప్పులను తెలిసికొని, వారు కూడ ప్రభువు వైపునకు మరళినారు. 
నా ప్రియులారా, దేవుడు ఈనాడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు! కానీ, తన బిడ్డలైన వారి ప్రార్థనలకు తప్పకుండా జవాబు లభిస్తుంది. మన ప్రార్థనలకు జవాబిస్తానని వాగ్దానము చేయుట మాత్రమే కాదు, ఆయన యందు మనము నిత్యము భయము కలిగియుండాలని మనలను ప్రోత్సహించుచున్నాడు. ' భయపడకుము; నీ ప్రార్థన వినబడినది ' అని మనలను ధైర్యపరచుచున్నాడు. జాయిస్ ప్రార్థనల పట్ల దేవుడు ప్రీతికలిగి, తన కుటుంబము పట్ల ఆమె చేసిన ప్రార్థనలను అంగీకరించి తన కుటుంబమంతయు యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. అదేవిధంగానే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు కష్టాల మధ్యలో ప్రభువు సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుడు తన చిత్తమును మీ జీవితములో నిశ్చయముగా నెరవేరుస్తాడు. ఆలాగుననే, మీరు కూడ దేవుని సన్నిధిలో ఆనందించినట్లయితే, " యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును '' (కీర్తనలు 37:4) అన్న వచనము ప్రకారము ఆయన మీ హృదయ వాంఛలను తీర్చి మిమ్మల్ని దీవిస్తాడు. 
Prayer:
దీవెనలకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీకు వ్యతిరేకంగా నున్న మా జీవితాన్ని మార్చుము. నేటి నుండి నిన్ను వెంబడించే కృపను మరియు నీకు భయపడే మనస్సును మాకు దయచేయుము. మా శ్రమల నుండి మాకు విడుదలను దయచేయుము. నీ మార్గములో మమ్మును నడిపించుము. ప్రభువా, నీ వాక్యము పట్ల మేము నిత్యము ఆనందించేవారమై యుండునట్లు మాకు అటువంటి హృదయమును దయచేయుము. మా కష్టాలు మరియు శ్రమల నుండియు మేము విడిపించబడాలని ఎంతో కాలముగా ప్రార్థిస్తున్నాము. దయతో నేడు మా ప్రార్థనకు జవాబును దయచేయుము. ప్రభువా, ఇప్పటి వరకు మేము నీకు భయపడనట్లయితే, నేటి నుండి నీలో నిత్యము భయము కలిగి జీవించుటకు మాకు సహాయము చేయుము. మా కష్టాల నుండి మమ్మును సంపూర్ణంగా విడిపించుము. పై చెప్పబడిన అమ్మాయి వలె మేము కూడ నిన్ను హత్తుకొని, భయభక్తులతో ప్రార్థించే కృపను అనుగ్రహించుము. మా ప్రార్థనలకు తప్పకుండా జవాబు దయచేస్తావని విశ్వసించుచు సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000